హీరో జయం రవి విడాకుల వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది. భార్య ఆర్తి రవిపై సంచలన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో గురువారం జయం రవి సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. విడాకుల విషయంలో మౌనంగా ఉండి తప్పు చేశానని, తనను తక్కువ చేసేలా ఎన్నో అబద్ధాలు ప్రచారం జరుగుతోన్నాయని ఈ పోస్ట్‌లో పేర్కొన్నాడు జయం రవి.. జయం రవి, ఆర్తి విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది.
మరోవైపు జయం రవి సింగర్ కేనీషాతో ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తోన్నాయి. ఈ డేటింగ్ వార్తలపై కూడా జయం రవి రియాక్ట్ అయ్యాడు. కష్టాల్లో ఉన్న టైమ్‌లో కేనీషా తనకు సపోర్ట్‌గా నిలిచిందని, కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకు వచ్చిన టైమ్‌లో కేనీషానే తనను ఆదుకున్నట్లు చెప్పాడు.
వ్యక్తిగత జీవితంలోనే కాదు కెరీర్ పరంగా ప్రస్తుతం జయం రవి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. అతడు హీరోగా నటించిన బ్రదర్, సైరన్, ఇరైవన్‌తో పాటు కాదలిక్క నెరమిల్లై సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం తమిళంలో ఓ నాలుగు సినిమాలు చేస్తోన్నాడు జయం రవి.
తమిళంలో టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతోన్న జయం రవి తెలుగులోనూ సినిమాలు చేశాడు. అయితే హీరోగా కాదు చైల్డ్ యాక్టర్‌గా మాత్రమే కనిపించాడు. జయం రవి తండ్రి ఎడిటర్ మోహన్ తెలుగులో స్టార్ హీరోలతో పలు సినిమాలు నిర్మించాడు. తండ్రి నిర్మాణంలో వచ్చిన బావ బావమరిది హీరో సుమన్ చిన్ననాటి క్యారెక్టర్‌లో జయం రవి కనిపించాడు. ఆ తర్వాత పల్నాటి పౌరుషంలో మూవీలో కూడా నటించాడు. జయం రవి చైల్డ్ యాక్టర్‌గా కనిపించిన ఈ రెండు తెలుగు సినిమాల్లో కృష్ణంరాజు హీరోగా నటించడం గమనార్హం.
హీరోగా మారిన తర్వాత నాని కథానాయకుడిగా నటించిన జెండాపై కపిరాజు మూవీలో
కనిపించాడు. ఈ మూవీ తమిళ వెర్షన్ హీరోగా నటించిన జయం రవి...తెలుగు వెర్షన్‌లో అతిథి పాత్రలో తళుక్కున మెరిశాడు.
కాగా జయం రవి తండ్రి ఎడిటర్ మోహన్ తెలుగులో చిరంజీవి హిట్లర్, బావ బావమరిది, మామగారు, మనసిచ్చి చూడు, హనుమాన్ జంక్షన్‌తో పాటు పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు. ఎడిటర్‌గా, స్క్రీన్ రైటర్‌గా కూడా కొన్ని సినిమాలు పనిచేశాడు. జయం రవి అన్నయ్య...మోహన్ రాజా హనుమాన్ జంక్షన్‌తో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి గాడ్‌ఫాదర్ మూవీకి కూడా మోహన్ రాజా దర్శకత్వం వహించాడు.
సంబంధిత కథనం