ఇన్నాళ్లూ వెన్నులో పొడిచింది.. ఇప్పుడు గుండెల్లో పొడుస్తోంది.. దారుణంగా హింసించింది: మాజీ భార్యపై తమిళ హీరో పోస్ట్ వైరల్-jayam ravi long post in his instagram about his ex wife aarti abusing hime going viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఇన్నాళ్లూ వెన్నులో పొడిచింది.. ఇప్పుడు గుండెల్లో పొడుస్తోంది.. దారుణంగా హింసించింది: మాజీ భార్యపై తమిళ హీరో పోస్ట్ వైరల్

ఇన్నాళ్లూ వెన్నులో పొడిచింది.. ఇప్పుడు గుండెల్లో పొడుస్తోంది.. దారుణంగా హింసించింది: మాజీ భార్యపై తమిళ హీరో పోస్ట్ వైరల్

Hari Prasad S HT Telugu

తమిళ నటుడు జయం రవి తన మాజీ భార్య ఆర్తిపై తన ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇన్నాళ్లూ వెన్నులో పొడిచిందని, ఇప్పుడు ఏకంగా గుండెల్లోనే పొడుస్తోందని అతడు అనడం గమనార్హం. ఈ మధ్యే రవిపై ఆర్తి చేసిన పోస్టుకు అతడు ఇలా కౌంటర్ ఇచ్చాడు.

ఇన్నాళ్లూ వెన్నులో పొడిచింది.. ఇప్పుడు గుండెల్లో పొడుస్తోంది.. దారుణంగా హింసించింది: మాజీ భార్యపై తమిళ హీరో పోస్ట్ వైరల్

తమిళ నటుడు జయం రవి ఈ మధ్యే తన గర్ల్‌ఫ్రెండ్‌గా భావిస్తున్న కనీషా ఫ్రాన్సిస్ తో ఓ పెళ్లికి హాజరైన విషయం తెలుసు కదా. దీనిపై అతని మాజీ భార్య ఆర్తి.. రవిని విమర్శిస్తూ ఓ పోస్ట్ చేసింది. దీనికి తాజాగా జయం రవి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గట్టి కౌంటరే ఇచ్చాడు. ఎన్నో ఏళ్లుగా తన పేరెంట్స్ ను కలవకుండా ఆమె తనను ఎలా అడ్డుకుందో కూడా అందులో చెప్పుకొచ్చాడు.

నా మౌనం బలహీనత కాదు

జయం రవి, ఆర్తి గతేడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు ఈ మధ్యే తన గర్ల్‌ఫ్రెండ్ గా భావిస్తున్న కనీషాతో కనిపించాడు. ఆమెతో తన రిలేషన్షిప్ పైనా, ఆర్తి చేసిన ఆరోపణలపైనా రవి ఇప్పుడు స్పందించాడు. తన మౌనాన్ని బలహీనతగా చూడొద్దని అన్నాడు.

“మన దేశం ప్రస్తుతం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా.. వ్యక్తిగత విషయాలపై చర్చ జరగడం చూస్తుంటే బాధగా ఉంది. నా వ్యక్తిగత జీవితాన్ని ఓ గాసిప్‌గా మార్చేశారు. అబద్ధాలను ప్రచారం చేయడం చూస్తుంటే బాధగా ఉంది. నా మౌనం నా బలహీనత కాదు. కానీ నా ప్రయాణం, నా జీవితంలో పడిన కష్టాల గురించి తెలియని వాళ్లు కూడా నా చిత్తుశుద్ధిని శంకిస్తుంటే నేను మాట్లాడిల్సిందే” అని రవి అన్నాడు.

పేరెంట్స్‌నూ కలవనీయలేదు

మాజీ భార్య ఆర్తితో జయం రవి
మాజీ భార్య ఆర్తితో జయం రవి

ఇక తన మాజీ భార్య ఆర్తి తనను ఎన్ని చిత్రహింసలు పెట్టిందో వివరించాడు. ఇప్పుడు సానుభూతి కోసం నిజాలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డాడు. “ఎన్నో ఏళ్లుగా నేను శారీరక, మానసిక, ఆర్థిక వేధింపులకు గురయ్యాను. దారుణంగా హింసించింది.

నా పేరెంట్స్ ను కూడా కలవనీయకుండా బంధించింది. అయినా పెళ్లిని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించాను. ఇక భరించలేను అనిపించిన తర్వాతే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయాన్ని నేనేదో తేలిగ్గా తీసుకోలేదు. అందుకే బరువైన హృదయంతో దీనిని మీకు రాస్తున్నాను” అని రవి అన్నాడు.

అప్పుడు వెన్నుపోటు.. ఇప్పుడు గుండెల్లో..

తాను ఎందుకు విడాకులు తీసుకున్నానో తన కుటుంబం, సన్నిహితులు, అభిమానులకు తెలుసు అని జయం రవి స్పష్టం చేశాడు. “తప్పుడు ఆరోపణలను నేను ఖండిస్తున్నాను. నా నిజంపైనే నేను దృఢంగా నిలబడతాను. న్యాయంపై నమ్మకంతో ఉంటాను” అని రవి అన్నాడు.

ఇక ఈ విషయంలో తన పిల్లలను వాడుకోవడం తనకు బాధగా ఉందని కూడా జయం రవి చెప్పాడు. “నేను నా పిల్లలను దూరం పెట్టానని చెబుతోంది. ఇలా చెప్పడం వల్ల సానుభూతి పొందాలని చూస్తోంది. తన స్వార్థ ప్రయోజనాల కోసం పిల్లలను వాడుకుంటోంది. గతేడాది కోర్టు అనుమతితో క్రిస్మస్ కు నా పిల్లలను కలిశాను. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా వాళ్లతో నన్ను కలవనీయలేదు. నా పిల్లల చుట్టూ బౌన్సర్లను ఏర్పాటు చేసింది. కానీ మీరు మాత్రం ఓ తండ్రిగా నా పాత్రను ప్రశ్నిస్తున్నారా?” అని జయం రవి ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ సుదీర్ఘ పోస్టుకు రవి పెట్టి క్యాప్షన్ కూడా ఆదేదనతో కూడి ఉంది. “ఇన్నేళ్లుగా నా వెన్నులో పొడుస్తూ వచ్చింది. ఇప్పుడు నా గుండెల్లోనే కత్తి దింపినందుకు సంతోషంగా ఉంది. తొలి, చివరి వివరణ ఇది. ప్రేమతో రవి మోహన్. బతకండి.. బతకనీయండి” అనే క్యాప్షన్ తో రవి ఈ పోస్ట్ చేశాడు.

కనీషాతో సంబంధంపై..

కనీషా ఫ్రాన్సిస్ తో జయం రవి
కనీషా ఫ్రాన్సిస్ తో జయం రవి

ఇక కనీషా ఫ్రాన్సిస్ తో తనకున్న సంబంధంపైనా జయం రవి స్పందించాడు. “కనీషా ఫ్రాన్సిస్ విషయానికి వస్తే.. మొదట్లో ఆమె నా స్నేహితురాలిగా ఉంది. మునిగిపోతున్న వ్యక్తిని కాపాడింది. నాకు కన్నీళ్లు, రక్తం తప్ప ఏమీ లేని పరిస్థితుల్లో నాకు అండగా నిలిచింది” అని రవి చెప్పాడు. రాత్రి వేళ ఇంట్లో నుంచి కట్టుబట్టలతో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా బయటకు వచ్చినప్పుడు ఆమె తన వెంట నిలిచిందని చెప్పాడు.

“ఆమె చాలా అందమైన సహచరురాలు. ఆమె పేరు కోసమో, ఆకర్షణ కోసమో నాతో నిలబడలేదు. నాకు తోడుగా ఓ సహానుభూతితో నాతో ఉంది.. నా మనసు తెలిసిన వాళ్లు ఆమెతోనూ అలాగే ఉంటారు. ఎవరూ నా జీవితాన్ని నాశనం చేయలేరు. ఎన్నోసార్లు బాధను అనుభవించాను. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు” అని రవి ముగించాడు.

జయం రవి, ఆర్తి 2009లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లు గతేడాది విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పారు. కనీషాతో సంబంధం వల్లే అతడు తనకు విడాకులు ఇచ్చాడని ఆర్తి ఆరోపించింది. దీనిపై తాజాగా రవి ఇలా స్పందించాడు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం