Jawan Remunerations: జవాన్ మూవీ కోసం నయనతార, షారుక్ ఖాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Jawan Remunerations: జవాన్ మూవీ కోసం నయనతార, షారుక్ ఖాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఈ మూవీలో నటించిన వారి రెమ్యునరేషన్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.
Jawan Remunerations: బాలీవుడ్ లో వస్తున్న మరో మోస్ట్ అవేటెడ్ మూవీ జవాన్. షారుక్ ఖాన్, నయనతార తొలిసారి జంటగా కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ పఠాన్ లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత కింగ్ ఖాన్ నటిస్తున్న సినిమా కావడంతో జవాన్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక తాజాగా ఈ జవాన్ మూవీలో నటించిన లీడ్ రోల్స్ రెమ్యునరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమాలో షారుక్, నయనతారతోపాటు విజయ్ సేతుపతి, దీపికా పదుకోన్ కూడా నటిస్తుండటం విశేషం. వచ్చే గురువారం (సెప్టెంబర్ 7) ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో జవాన్ కోసం షారుక్, నయనతార ఎంత మొత్తం అందుకుంటున్నారో ఓసారి చూద్దాం.
షారుక్ ఖాన్.. రూ.100 కోట్లు
ఇండియాలో అత్యధిక మొత్తం అందుకునే హీరోల్లో ఒకడైన షారుక్ ఖాన్.. జవాన్ మూవీ కోసం ఏకంగా రూ.100 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు జవాన్ మూవీ ఆదాయంలోనూ షారుక్ కు 60 శాతం వాటా దక్కనుంది. ఈ సినిమాను అతనికే చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ తెరకెక్కిస్తోంది.
నయనతార
సౌతిండియా లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన నయనతార తొలిసారి షారుక్ సరసన ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం నయన్ ఏకంగా రూ.11 కోట్లు అందుకోబోతుండటం విశేషం.
విజయ్ సేతుపతికీ భారీగానే..
ఇక తమిళంలో విలక్షణ నటుడిగా పేరుగాంచిన విజయ్ సేతుపతి ఈ మధ్యే తరచూ హిందీ వెబ్ సిరీస్, సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఈ జవాన్ మూవీలోనూ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం అతడు రూ.21 కోట్లు రెమ్యునరేషన్ గా అందుకుంటున్నాడట.
ఇక జవాన్ లో అతిథిపాత్రలో కనిపిస్తున్నా కూడా దీపికా పదుకోన్ ఏకంగా రూ.15 నుంచి 30 కోట్ల మధ్య రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. మరో సౌతిండియా నటి ప్రియమణి కూడా ఈ సినిమాలో నటించింది. గతంలో చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలో షారుక్ తో కలిసి ఓ పాటలో నటించిన ప్రియమణి.. ఈ జవాన్ కోసం రూ.2 కోట్లు అందుకుంది.