Jawan OTT: ఓటీటీలోకి వచ్చేసిన జవాన్.. థియేటర్లలో చూపించని సీన్లతో.. షారుక్ బర్త్ డే కానుకగా!
Jawan OTT Streaming With Extended Version: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ పుట్టిన రోజు కానుకగా అభిమానులకు ఆయన నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ జవాన్ మూవీ నవంబర్ 2 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా థియేటర్లలో చూపించని సన్నివేశాలతో ఓటీటీలో రిలీజ్ చేశారు.
Shahrukh Khan Birthday Jawan OTT Streaming: కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ (Shahrukh Khan), సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార (Nayanthara) తొలిసారిగా కలిసి నటించిన మూవీ జవాన్. షారుక్ ఖాన్ తండ్రి కొడుకులు వంటి రెండు పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌లో షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాతో అటు అట్లీ.. ఇటు నయనతార ఇద్దరూ బాలీవుడ్‍కు ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ కొట్టారు.
సెప్టెంబర్ 7న హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైల్డ్ గా విడుదలైన జవాన్ సినిమా వేల కోట్ల వసూళ్లు రాబట్టింది. అయితే, ఇప్పుడు జవాన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. షారుక్ ఖాన్ బర్త్ డే సందర్భంగా నవంబర్ 2 నుంచి అంటే నేటి నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా అదనపు సన్నివేశాలను జోడించి మరి విడుదల చేశారు. అంటే, థియేటర్లలో చూపించని సన్నివేశాలను యాడ్ చేసి మరి స్ట్రీమింగ్ చేస్తున్నారు.
థియేటర్లలో జవాన్ మూవీ చూసిన మళ్లీ ఓటీటీలో చూసేలా విడుదల చేశారు మేకర్స్. ఓటీటీలో జవాన్ మూవీ రన్ టైమ్ థియేటర్లో ఉన్న దానికంటే ఎక్కువగా ఉంది. దీంతో షారుక్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇదిలా ఉంటే జవాన్ సినిమాలో నయనతార, షారుక్ ఖాన్‍తోపాటు బాలీవుడ్ హాట్ బ్యూటి దీపికా పదుకొణె, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ప్రియమణి, సాన్య మల్హోత్రా, రిధి డోగ్రా, బిగ్ బాస్ సిరి హన్మంతు, యోగిబాబు, సంజయ్ దత్, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. ఇక విజయ్ సేతుపతి విలన్‌గా చేయగా.. తండ్రి పాత్రలో ఉన్న షారుక్ ఖాన్‍కు భార్య పాత్రలో దీపికా నటించింది.