Jawan OTT Release Date: షారుఖ్‌ఖాన్ జవాన్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. షారుఖ్‌ఖాన్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 2న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన ప్రకటన ఆదివారం లేదా సోమవారం అఫీషియల్‌గా రిలీజ్ కానున్నట్లు తెలిసింది. జవాన్ మూవీకి అట్లీ దర్శకత్వం వహించాడు.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన జవాన్ మూవీ 1150 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన ఐదో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో సెకండ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా చరిత్రను సృష్టించింది. జవాన్ సినిమా ఓటీటీ హక్కులను దాదాపు 250 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. షారుఖ్ ఖాన్ కెరీర్‌లో అత్యధిక ధరకు ఓటీటీ హక్కులు అమ్ముడుపోయిన సినిమాగా జవాన్ నిలిచింది.
జవాన్ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతోనే నయనతార హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. దీపికా పడుకోణ్ అతిథి పాత్రలో నటించింది. జవాన్ సినిమాకు కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతాన్ని అందించాడు.
జవాన్ సినిమాలో ఆజాద్, విక్రమ్ రాథోడ్ అనే రెండు పాత్రల్లో షారుఖ్‌ఖాన్ కనిపించాడు. మైట్రో ట్రైన్‌ను విక్రమ్ రాథోడ్ అనే వ్యక్తి హైజాక్ చేస్తాడు. ఈ హైజాక్ కేసును నర్మద (నయనతార) చేపడుతుంది. మెట్రో ట్రైన్‌ను విక్రమ్ రాథోడ్ ఎందుకు హైజాక్ చేశాడు?
ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఆజాద్‌తో విక్రమ్ రాథోడ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? వెపన్ డీలర్ కాళీపై (విజయ్ సేతుపతి) పగతో విక్రమ్ రాథోడ్ రగిలిపోవడానికి కారణం ఏమిటి? అన్నదే ఈ సినిమా కథ. జవాన్ సినిమాలోని షారుఖ్‌ఖాన్ యాక్టింగ్‌తో పాటు హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.