Jawan box office collections: రూ.900 కోట్లు దాటిన జవాన్ కలెక్షన్లు
Jawan box office collections: రూ.900 కోట్లు దాటాయి జవాన్ మూవీ కలెక్షన్లు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన ఈ మూవీ ఇప్పుడు రూ.1000 కోట్ల వసూళ్లపై కన్నేసింది.
Jawan box office collections: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ రూ.900 కోట్ల కలెక్షన్ల క్లబ్ లో చేరింది. రిలీజైన 13వ రోజు ఈ మూవీ ఈ ఘనత సాధించడం విశేషం. ఇప్పటికీ ఏమాత్రం జోరు తగ్గని జవాన్.. ఇక రూ.1000 కోట్ల కలెక్షన్లపై కన్నేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 13 రోజులు కలిపి ఏకంగా రూ.907.54 కోట్లు వసూలు చేసింది.
ట్రెండింగ్ వార్తలు
జవాన్ మూవీ తొలి రోజు నుంచే కలెక్షన్ల విషయంలో సంచలనాలు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో పఠాన్ మూవీతో తొలిసారి రూ.1000 కోట్ల మార్క్ అందుకున్న షారుక్ ఖాన్.. ఇప్పుడు ఒకే ఏడాదిలో అలాంటి రెండు సినిమాలు అందించిన తొలి హీరోగా నిలవడానికి సిద్ధమవుతున్నాడు. మరో రెండు రోజుల్లో జవాన్ మూవీ రూ.వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
అట్లీ కుమార్ డైరెక్ట్ చేసిన జవాన్ సినిమాలో షారుక్ సరసన నయనతార నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను తెరకెక్కించిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ జవాన్ ప్రపంచవ్యాప్త కలెక్షన్ల గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. "బాక్సాఫీస్ ను కింగ్ ఇలా ఏలాడు. జవాన్ మూవీని హిందీ, తెలుగు, తమిళంలలో చూడండి" అనే క్యాప్షన్ తో కలెక్షన్లను రివీల్ చేసింది.
జవాన్ మూవీ ఎలా ఉందంటే..
షారుఖ్‌ఖాన్ వన్ మెన్ షోగా జవాన్ సినిమా నిలిచింది. విక్రమ్ రాథోడ్‌గా, ఆజాద్‌గా డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో చెలరేగిపోయాడు. కామెడీ టైమింగ్, యాక్షన్, ఎమోషన్స్ అన్నింటిలో తన మార్కును చూపించాడు.
యాక్షన్ ప్రధాన పాత్రలో నయనతార ఇంటెన్స్ యాక్టింగ్ తో మెప్పించింది. దీపికా పడుకోణ్, సంజయ్‌దత్ పాత్రల నిడివి తక్కువే అయినా ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తాయి. విలన్‌గా విజయ్ సేతుపతి లుక్ కొత్తగా ఉంది. షారుఖ్‌కు ధీటుగా నటించాడు.
షారుఖ్‌ఖాన్ అభిమానులతో పాటు యాక్షన్ లవర్స్ కు జవాన్ సినిమా విందుభోజనంలా ఉంటుంది. లాజిక్స్ పక్కనపెట్టి మంచి కమర్షియల్ సినిమా చూడాలనుకుంటే జవాన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.