స్పీడ్ తగ్గితే ట్రైన్ బ్లాస్టే! ఓటీటీలోకి ఉత్కంఠగా సాగే థ్రిల్లర్.. తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్-japanese action thriller bullet train explosion streaming now on netflix ott also in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  స్పీడ్ తగ్గితే ట్రైన్ బ్లాస్టే! ఓటీటీలోకి ఉత్కంఠగా సాగే థ్రిల్లర్.. తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్

స్పీడ్ తగ్గితే ట్రైన్ బ్లాస్టే! ఓటీటీలోకి ఉత్కంఠగా సాగే థ్రిల్లర్.. తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్

బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు ఈ థ్రిల్లింగ్ చిత్రం అడుగుపెట్టింది. తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది.

ఓటీటీలోకి ఉత్కంఠభరితమైన థ్రిల్లింగ్ చిత్రం.. స్పీడ్ తగ్గితే ట్రైన్ బ్లాస్టే! తెలుగులోనూ స్ట్రీమింగ్

జపనీస్ సినిమా ‘బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్’ నేరుగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో సుయోషి కుసనాగి, కనాటా హొసోడా లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రానికి షింజి హుగుచి దర్శకత్వం వహించారు. 1975లో వచ్చిన బుల్లెట్ ట్రైన్ మూవీకి సీక్వెల్‍‌గా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రూపొందింది. బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్ సినిమా డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఆ వివరాలు ఇవే..

స్ట్రీమింగ్ ఎక్కడంటే.. తెలుగులోనూ..

బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తాజాగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. థియేటర్లలో రాకుండా నేరుగా ఓటీటీలోకే ఎంట్రీ ఇచ్చింది. జపనీస్‍తో పాటు ఇంగ్లిష్, తెలుగు, తమిళం, హిందీలోనూ నెట్‍ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

వేగం తగ్గితే ట్రైన్ బ్లాస్ట్!

బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్ మూవీ ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్‍తో తెరకెక్కింది. రన్నింగ్‍లో ఉన్న ట్రైన్ గంటకు 100 కిలోమీటర్ల వేగంగా కంటే తగ్గితే పేలిపోయేలా ఓ బాంబ్‍ను విలన్లు సెట్ చేసి ఉంటారు. దీంతో ఆ ట్రైన్‍లోని వారిని కాపాడేందుకు ప్రభుత్వ అధికారులు ఆపరేషన్ చేపడతారు. ఆ ట్రైన్ బ్లాస్ట్ కాకుండా అధికారులు చేయగలిగారా? జనాలను రక్షించారా? ఈ మిషన్ ఎలా సాగిందనే విషయాలు ఈ చిత్రంలో ఉంటాయి. గ్రిప్పింగ్‍గా, ఉత్కంఠభరితంగా ఈ సినిమా సాగుతుంది.

బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్‌లో చూసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ లాగే ఈ మూవీ చాలా పేసీగా ఉందని, గ్రిప్పింగ్‍గా సాగిందని అంటున్నారు. ఈ చిత్రం థ్రిల్లింగ్ సీన్లు చాలా ఉన్నాయని, సస్పెన్స్ అదిరిపోయిందని రాసుకొస్తున్నారు. టెన్షన్ సాగేలా నరేషన్ కూడా బాగుందని అభిప్రాయపడుతున్నారు.

బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్ మూవీలో కుసనాగి, కనాటా హొసోడాతో పాటు నోన్, తముకి సైతో, మచికో ఓనో, జున్ కనామే, హనా టోయోషిమా, సతోరో మతుసువో కీలకపాత్రలు పోషించారు. గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు షిజి హుగుచి. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ చిత్రం భారీ వ్యూస్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నెట్‍ఫ్లిక్స్‌లో ‘మ్యాడ్ స్క్వేర్’

మ్యాడ్ స్క్వేర్ సినిమా ఈ శుక్రవారం ఏప్రిల్ 25వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. సంతోష్ శోభన్, రామ్ నితిన్, నార్నే నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ తెలుగు కామెడీ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మార్చి 28న థియేటర్లలో విడుదలైన మ్యాడ్ స్క్వేర్ మంచి హిట్ కొట్టింది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం