ముంబైలో తన రాబోయే చిత్రం హోంబౌండ్ ప్రీమియర్ సందర్భంగా జాన్వీ కపూర్ మెరిసిపోయింది. ఆమె తన తల్లి శ్రీదేవి గుర్తుగా ఆమె ధరించిన ఐకానిక్ చీరను కట్టుకుని ఘన నివాళులు అర్పించింది. ఈ కార్యక్రమంలో ఆమె తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహరియా కుటుంబాన్ని ఎంతో ప్రేమగా ఆహ్వానించింది.
హోంబౌండ్ మూవీ ప్రీమియర్‌లో తన దివంగత తల్లి శ్రీదేవిని జాన్వీ కపూర్ గౌరవించింది. సోమవారం (సెప్టెంబర్ 23) రాత్రి ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో జాన్వీ, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, కరణ్ జోహార్తో సహా చిత్ర బృందం పాల్గొంది. ఈ కార్యక్రమంలో జాన్వీ తన తల్లి శ్రీదేవి గుర్తుగా ఆమె మనీష్ మల్హోత్రా ఆర్కైవ్ చీరలలో ఒకదానిని ధరించింది.
2017లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వివాహ వేడుకలో ఆమె తల్లి ధరించిన రాయల్ బ్లూ, బ్లాక్ చీరను ఇప్పుడు జాన్వీ కట్టుకుంది. దానితో బ్లాక్ వెల్వెట్ బ్లౌజ్, స్టేట్‌మెంట్ ఈయర్ రింగ్స్, చోకర్ నెక్లెస్, చక్కని బన్ తో తన లుక్‌ను పూర్తి చేసింది.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఇతర వీడియోలలో జాన్వీ కపూర్ తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహరియా కుటుంబాన్ని ఎంతో ప్రేమగా ఆహ్వానించింది. ఒక వీడియోలో జాన్వీ అతని అమ్మమ్మ కాళ్ళకు తాకి ఆపై ఆమెను హత్తుకుంది. ఆ తరువాత ఆమె రెడ్ కార్పెట్‌లో మొత్తం కుటుంబంతో పోజులిచ్చింది. వారితో స్నేహపూర్వకంగా మాట్లాడింది. ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
హోంబౌండ్ మూవీ ప్రీమియర్‌కు హృతిక్ రోషన్, విక్కీ కౌశల్, తమన్నా భాటియా, ట్వింకల్ ఖన్నా, ఫరా ఖాన్, మనీష్ మల్హోత్రాతో సహా బాలీవుడ్ పరిశ్రమలోని అనేక మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. జాన్వీ చివరిగా పరమ్ సుందరి సినిమాలో కనిపించింది. తుషార్ జలోట దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించారు. ఆమె త్వరలోనే నీరజ్ ఘాయ్వాన్ దర్శకత్వం వహించిన హోంబౌండ్ చిత్రంలో కనిపిస్తుంది.
హోంబౌండ్ భారతదేశంలోని థియేటర్లలో విడుదలయ్యే ముందే 2026 అకాడమీ (ఆస్కార్) అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతదేశం నుండి ఎంపికైంది. ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా కూడా నటించారు. కరణ్ జోహార్ నిర్మించిన హోంబౌండ్ గ్రామీణ భారతదేశంలోని ఇద్దరు బాలుల ప్రయాణాన్ని చూపుతుంది. జాన్వీ మరోవైపు సన్నీ సంస్కారి కి తుల్సి కుమారి చిత్రంలో కూడా కనిపిస్తుంది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, రోహిత్ సరఫ్, సాన్యా మల్హోత్రా కూడా నటించారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన సన్నీ సంస్కారి కి తుల్సి కుమారి అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలవుతుంది.
సంబంధిత కథనం