Janhvi Kapoor: నన్ను గొడ్డలితో నరికి చంపేస్తే ఎలా?: అభిమానికి జాన్వీ ఇచ్చిన రిప్లై వైరల్
Janhvi Kapoor: జాన్వీ కపూర్, ఓ రెడిట్ యూజర్ కు మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ మధ్యే ఆమె రెడిట్ లో యూజర్లతో కాసేపు గడిపి వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.
Janhvi Kapoor: జాన్వీ కపూర్ సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో తరచూ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె చాలా అరుదుగా వాడే రెడిట్ (Reddit)లో తన అభిమానులతో మాట్లాడింది. ఆస్క్ మి ఎనీథింగ్ (ఏఎంఏ) సెషన్ నిర్వహించగా.. ఓ అభిమాని తనతో డేటింగ్ కు రావాల్సిందిగా అడిగాడు. దీనికి జాన్వీ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.
నువ్వు హంతకుడివైతే ఎలా?
ప్రస్తుతం జాన్వీ కపూర్ తన నెక్ట్స్ మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ సందర్భంగానే ఆమె రెడిట్ యూజర్లతో మాట్లాడింది. వాళ్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. వీటిలో చాలా వరకూ ఆమె సినిమాలు, ఫ్యామిలీ గురించే ఉన్నాయి. కానీ ఒక యూజర్ మాత్రం ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడగగా.. జాన్వీ కూడా అలాగే సమాధానం ఇచ్చింది.
"మనం డేట్ కు వెళ్దామా? అది మంచి స్టోరీ అవుతుంది" అని ఓ రెడిట్ యూజర్ అడిగాడు. దీనికి జాన్వీ స్పందిస్తూ.. "నువ్వు గొడ్డలితో నరికి చంపే హంతకుడివి అయితే ఎలా?" అని తిరిగి ప్రశ్నించింది. ఈ రిప్లై కాస్తా వైరల్ అయిపోయింది. యూజర్ సరదాగా అడిగిన ప్రశ్నకు జాన్వీ కూడా అంతే సరదాగా సమాధానం ఇవ్వడం విశేషం.
ఇక రెడిట్ ను తనకంటే ఎక్కువగా చెల్లి ఖుషీనే వాడుతుందని, ఇందులో ఏం జరుగుతుందో తాను ఆమెను అడిగే తెలుసుకుంటానని జాన్వీ చెప్పింది. అయితే జాన్వీ సెషన్ లో చాలా వరకూ సిల్లీ ప్రశ్నలే వచ్చాయి. వీటికి యూజర్లు నెగటివ్ ఓట్స్, కామెంట్స్ చేశారు. మరికొందరు దారుణమైన ప్రశ్నలు అడిగితే.. మోడరేటర్ వాటిని తొలగించారు.
పెళ్లిపై జాన్వీ క్లారిటీ
ఇక జాన్వీ కపూర్ పెళ్లి చేసుకోబోతోందని, తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి ఏడడుగులు వేయబోతోందని వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. వీటిపైనా జాన్వీ స్పందించింది. ఈ మధ్యే ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ పుకార్లకు చెక్ పెట్టింది. "ఈ మధ్యే నేను చాలా వింత వార్తను ఎక్కడో చదివాను. నేను ఎవరితోనూ రిలేషన్షిప్ ను కన్ఫమ్ చేసి పెళ్లి చేసుకోబోతున్నానని అందులో ఉంది.
రెండు, మూడు ఆర్టికల్స్ ను కలిపేసి నేను పెళ్లి చేసుకుంటానని రాసేశారు. నాకు వారం రోజుల్లోనే పెళ్లి చేసేస్తున్నారు. దానికి నేను అంగీకరించను (నవ్వుతూ..). ప్రస్తుతానికి సినిమాలే చేయాలనుకుంటున్నాను" అని జాన్వీ స్పష్టం చేసింది.
ఇంతకుముందు కూడా జాన్వీ పెళ్లి చేసుకోబోతోందని, ఆమె పెళ్లి తిరుపతిలోనే జరగనుందన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ కామెంట్స్ పై కూడా జాన్వీ స్పందిస్తూ.. ఏది పడితే అది రాసేస్తారా అని అనడం గమనార్హం. ప్రస్తుతం మిస్టర్ అండర్ మిసెస్ మహి మూవీ రిలీజ్ కోసం జాన్వీ ఎదురు చూస్తోంది. ఇక తెలుగులోనూ దేవర, ఆర్సీ16 మూవీస్ లో జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే.