Janhvi Kapoor with Boy Friend: బాయ్‌ఫ్రెండ్‌తో జాన్వీ హ్యాంగ్ ఔట్.. కెమెరా కంటికి చిక్కిన జంట..!-janhvi kapoor smiles with rumoured boyfriend shikhar pahariya in car
Telugu News  /  Entertainment  /  Janhvi Kapoor Smiles With Rumoured Boyfriend Shikhar Pahariya In Car
బాయ్ ఫ్రెండ్‌తో జాన్వీ కపూర్
బాయ్ ఫ్రెండ్‌తో జాన్వీ కపూర్

Janhvi Kapoor with Boy Friend: బాయ్‌ఫ్రెండ్‌తో జాన్వీ హ్యాంగ్ ఔట్.. కెమెరా కంటికి చిక్కిన జంట..!

31 January 2023, 10:48 ISTMaragani Govardhan
31 January 2023, 10:48 IST

Janhvi Kapoor with Boy Friend: జాన్వీ కపూర్ తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి కనిపించింది. కరణ్ జోహార్ ఇంటి వద్ద వీరిద్దరూ కారులో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Janhvi Kapoor with Boy Friend: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన రిలేషన్‌షిప్ గురించి బాహాటంగానే హింట్ ఇచ్చేసింది. తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహరియాతో డేటింగ్‌లో ఉందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ ఈ విషయాన్ని మాత్రం అధికారికంగా చెప్పలేదు. గతేడాది వీరిద్దరూ కలిసి మాల్దీవులకు వెకేషన్‌కు కూడా వెళ్లారు. అప్పటి నుంచి మీడియా దృష్టి వీరిద్దరిపైన పడింది. తాజాగా మరోసారి వీరు కమెరా కంటికి చిక్కారు. సోమవారం రాత్రి వీరిద్దరూ కరణ్ జోహార్ ఇంటి నుంచి వస్తుండగా మీడియా కన్ను వీరి మీద పడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను గమనిస్తే బ్రౌన్ మినీ డ్రెస్‌లో కోట్ ధరించి జాన్వీ కనిపించింది. లూజ్ హెయిర్‌తో బ్లాక్ బ్యాగ్, హుప్ ఇయర్ రింగ్స్‌తో కనిపించింది. మరోపక్క శిఖర్ స్లీవ్ స్వెటర్‌తో పాటు బ్లూ జీన్స్‌లో దర్శనమిచ్చాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వులు చిందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.

జాన్వీ తన బాయ్ ఫ్రెండ్ ఎవరో పబ్లిక్‌గా చెప్పకనే చెప్పేసింది అని ఓ యూజర్ స్పందించగా.. వీరిద్దరూ ఎంతో అందంగా ఉన్నారని మరొకరు స్పష్టం చేశారు. జాన్వీ తెగ సిగ్గుపడుతోంది అంటూ మరో ఫ్యాన్ లాఫింగ్ ఎమోజీని జత చేశాడు. టైమ్ పాస్ బాయ్‌ఫ్ర్రెండ్ అంటూ ఇంకో యూజర్ స్పందించాడు.

ఇటీవల జాన్వీ-శిఖర్ ప్రముఖ నిర్మాత-స్టైలిస్ట్ రియా కపూర్ నివాసం వద్ద కనిపించారు. అంతేకాకుండా ముంబయిలో రీసెంట్‌గా అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ నిశ్చితార్థంలోనూ సందడి చేశారు. శిఖర్ తరచూ జాన్వీ ఇన్ స్టాగ్రామ్ పోస్టులపై తన స్పందనను తెలియజేస్తూ ఉంటాడు. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడే ఈ శిఖర్. వీరిద్దరూ డేటింగ్ చేశారని తర్వాత విడిపోయారని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

సినిమాల విషయానికొస్తే జాన్వీ కపూర్.. వరుణ్ ధావన్‌తో కలిసి బావల్ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా 2023 ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇది కాకుండా మిస్టర్ అండ్ మిసెస్ మహీ అనే చిత్రంలో రాజ్ కుమార్ రావ్ సరసన చేస్తోంది. ఇందులో ఈ ముద్దుగుమ్మ క్రికెటర్ పాత్రలో కనిపించనుంది.