Janhvi Kapoor: తమిళ సూపర్ హిట్ మూవీని ఓటీటీలో లేట్‍గా చూసిన జాన్వీ కపూర్.. ‘హార్ట్ బ్రేకింగ్’ అంటూ పోస్ట్ చేసిన బ్యూటీ-janhvi kapoor review amaran movie says heart breaking this film streaming on netflix ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janhvi Kapoor: తమిళ సూపర్ హిట్ మూవీని ఓటీటీలో లేట్‍గా చూసిన జాన్వీ కపూర్.. ‘హార్ట్ బ్రేకింగ్’ అంటూ పోస్ట్ చేసిన బ్యూటీ

Janhvi Kapoor: తమిళ సూపర్ హిట్ మూవీని ఓటీటీలో లేట్‍గా చూసిన జాన్వీ కపూర్.. ‘హార్ట్ బ్రేకింగ్’ అంటూ పోస్ట్ చేసిన బ్యూటీ

Janhvi Kapoor: బ్లాక్‍బస్టర్ అయిన తమిళ మూవీని ఓటీటీలో ఆలస్యంగా చూశారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. హార్ట్ బ్రేకింగ్ చిత్రం అంటూ రివ్యూతో ఇన్‍స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఇవే..

Janhvi Kapoor: తమిళ సూపర్ హిట్ మూవీని ఓటీటీలో లేట్‍గా చూసిన జాన్వీ కపూర్.. ‘హార్ట్ బ్రేకింగ్’ అంటూ పోస్ట్ చేసిన బ్యూటీ

తమిళ మూవీ ‘అమరన్’ ప్రశంసలను దక్కించుకోవడంతో కమర్షియల్‍గానూ భారీ సక్సెస్ అయింది. ఈ చిత్రంలో శివకార్తికేయన్, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ సుమారు రూ.340కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. భారీ హిట్ సాధించింది. అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాను ఆలస్యంగా ఓటీటీలో చూశారు యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఆ తర్వాత రివ్యూ ఇచ్చారు.

హృదయాన్ని హత్తుకుందంటూ..

అమరన్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు జాన్వీ కపూర్. ఈ సినిమా హృదయాన్ని హత్తుకోవడంతో పాటు బద్దలు చేసిందని ఇన్‍స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశారు. హార్ట్ బ్రేకింగ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అంటూ రాసుకొచ్చారు.

అమరన్ మూవీ చూసి ఈ సంవత్సరం అత్యుత్తమంగా ముగిసిందని జాన్వీ పోస్ట్ చేశారు. “లేట్ అయింది. కానీ ఇది మ్యాజికల్, ఎమోషనల్, కదిలించే సినిమా. హృదయాన్ని అత్యంత హత్తుకునే, హార్ట్ బ్రేకింగ్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఈ ఏడాది అద్భుతంగా ముగిసింది” అని జాన్వీ కపూర్ ఈ మూవీకి రివ్యూ రాశారు.

అమరన్ భారీ బ్లాక్‍బస్టర్

అమరన్ చిత్రం అక్టోబర్ 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో రిలీజ్ అయింది. సుమారు రూ.120కోట్లతో రూపొందిన ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.340 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. మంచి చిత్రంగా పేరు తెచ్చుకోవటంతో బాక్సాఫీస్ వద్ద కూడా అమరన్ బ్లాక్‍బస్టర్ సాధించింది.

అమరన్ చిత్రంలో మేజర్ ముకుంద్ వరదరాజన్‍గా శివకార్తికేయన్, ఆయన భార్య ఇందు రెబ్బా వర్గీస్ పాత్రలో సాయిపల్లవి నటన హైలైట్‍గా నిలిచింది. అమర జవాన్ జీవితాన్ని దర్శకుడు రాజ్‍కుమార్ పెరియస్వామి తెరపై అద్భుతంగా, భావోద్వేగంగా తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీలో రాహుల్ బోస్, భువన్ అరోరా, హితాక్షి, శ్రీకుమార్, శ్యాంప్రసాద్, శ్యాంమోహన్ కీలకపాత్రలు పోషించారు.

అమరన్ చిత్రాన్ని రాజ్‍కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా పతాకాలపై లోకనాయకుడు కమల్ హాసన్, మహేంద్రన్, వివేక్ కృష్ణని ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా.. సీహెచ్ సాయి సినిమాటోగ్రఫీ చేశారు.

అమరన్ మూవీ స్ట్రీమింగ్

అమరన్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. డిసెంబర్ 5వ తేదీన ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టింది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.