జాన్వీ కపూర్ రొమాంటిక్ మూవీ.. కాంతార 2తో ఢీ.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ ఆఫర్-janhvi kapoor latest romantic comedy sunny sanskari ki tulsi kumari buy one get one ticket offer kantara chapter 1 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  జాన్వీ కపూర్ రొమాంటిక్ మూవీ.. కాంతార 2తో ఢీ.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ ఆఫర్

జాన్వీ కపూర్ రొమాంటిక్ మూవీ.. కాంతార 2తో ఢీ.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ ఆఫర్

వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ 'సన్నీ సంస్కారి కి తులసి కుమారి'. ఇది బాక్సాఫీస్ దగ్గర కాంతారా చాప్టర్ 1తో పోటీపడుతోంది. అయితే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ ఇప్పుడు వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ ప్రకటించింది.

సన్నీ సంస్కారి కి తులసి కుమారి పోస్టర్ (Instagram)

వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'సన్నీ సంస్కారి కి తులసి కుమారి' సినిమా ప్రియుల కోసం ఒక అద్భుతమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1తో పోటీ పడుతోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 2న కాంతార చాప్టర్ 1, సన్నీ సంస్కారి కి తులసి కుమారి రిలీజైన సంగతి తెలిసిందే.

జాన్వీ కపూర్ సినిమా

జాన్వీ కపూర్ రొమాంటిక్ మూవీ సన్నీ సంస్కారికి తులసి కుమారి మూవీ విడుదలై 4 రోజులు పూర్తయ్యింది. హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అదర్ పూనావల్లా, శశాంక్ ఖైతాన్ ధర్మ ప్రొడక్షన్స్, మెంటర్ డిసైపుల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. దీని బడ్జెట్ రూ. 31.14 కోట్లు. మొదటి వారం వసూళ్లను పెంచడానికి మేకర్స్ బై 1 గెట్ 1 టికెట్ ఆఫర్ పెట్టారు.

నిర్మాతలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ద్వారా “ప్రేమికులకు, గుండె పగిలిన వాళ్లకు ఈ సీజన్‌లోని గొప్ప ➕1️⃣ ఆఫర్!” అని తెలిపారు. టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు వినియోగదారులు ఆఫర్‌ను పొందడానికి SSKTK కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్, మనీష్ పాల్, అక్షయ్ ఒబెరాయ్ కూడా నటించారు.

బాక్స్ ఆఫీస్ కలెక్షన్

ట్రేడ్ ట్రాకింగ్ సైట్ సక్నిల్క్ ప్రకారం సన్నీ సంస్కారి కి తులసి కుమారి చిత్రం ఇప్పటివరకు భారతదేశంలో రూ. 30 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఆదివారం నాడు 3.33 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకు ముందు రోజు రూ. 7.75 కోట్ల నికర వసూళ్లు చేసింది. 4వ రోజు నికర వసూళ్లు రూ. 7.5 కోట్లతో వారాంతపు మొత్తం రూ. 15.25 కోట్లకు చేరింది. థియేటర్లలో 4 రోజుల ప్రదర్శనలో రూ. 30 కోట్లు వసూలు చేసింది. జాన్వీ కపూర్ కెరీర్‌లో మిస్టర్ & మిసెస్ మహి తర్వాత ఇది ఐదవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

బ్రేక్ ఈవెన్

మిస్టర్ & మిసెస్ మహి జీవితకాలంలో రూ. 36.34 కోట్లు వసూలు చేసింది. సన్నీ సంస్కారి కి తులసి కుమారి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే 3వ రోజుకు బ్రేక్ ఈవెన్ సాధించింది. మూడు రోజుల్లో రూ. 31.70 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సక్నిల్క్ నివేదించింది. ఈ సమయంలో ఓవర్సీస్ మార్కెట్ నుండి రూ. 5 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ రూ.31.14 కోట్లు మాత్రమే.

సన్నీ సంస్కారి కి తులసి కుమారి కథ

ఐఎండీబీ ప్రకారం.. ఈ సినిమాలో ఢిల్లీలో విడిపోయిన ఇద్దరు ప్రేమికులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. దీని వలన అనేక తప్పులు జరుగుతాయి. గందరగోళం మధ్య ఒక కొత్త ప్రేమ చిగురిస్తుంది. ఈ గందరగోళంలో ఎవరు సంతోషంగా ఉంటారో చూడాలి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం