Janhvi Kapoor Boyfriend: తనను దళితుడన్న ట్రోలర్‌పై విరుచుకుపడిన జాన్వీ కపూర్ బాయ్‌ఫ్రెండ్.. నీ ఆలోచనే అంటరానిదంటూ..
Janhvi Kapoor Boyfriend: జాన్వీ కపూర్ బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా తనను దళితుడు అన్న ఓ ట్రోలర్ పై విరుచుకుపడ్డాడు. గతేడాది తాను చేసిన పోస్టుపై వచ్చిన కామెంట్ కు ఘాటుగా స్పందించాడు. ఇప్పుడతని రిప్లై వైరల్ అవుతోంది.
Janhvi Kapoor Boyfriend: జాన్వీ కపూర్ బాయ్‌ఫ్రెండ్ తెలుసు కదా. అతని పేరు శిఖర్ పహారియా. ఇప్పుడతడు మరోసారి వార్తల్లో నిలుస్తున్నాడు. తన కులం గురించి ప్రస్తావిస్తూ దళితుడిని అంటూ ఓ వ్యక్తి ప్రస్తావించడంపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ కాలంలో అంటరానిది ఏదైనా ఉందంటే అది నీ ఆలోచన మాత్రమే అంటూ అతడు కామెంట్ చేయడం గమనార్హం.
ట్రోలింగ్‌పై శిఖర్ రియాక్షన్ ఇలా..
గతేడాది దీపావళికి శిఖర్, జాన్వీ తమ పెంపుడు కుక్కలతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో శిఖర్ పోస్ట్ చేశాడు. ఇటీవల ఓ వ్యక్తి ఆ పోస్ట్ కింద "నువ్వు దళితుడివి కదా (Lekin tu toh Dalit hai)" అని కామెంట్ చేశాడు. దానికి శిఖర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆ కామెంట్‌ను పోస్ట్ చేస్తూ, "2025లో కూడా నీలాంటి చిన్న, వెనుకబడిన ఆలోచనలు ఉన్నవాళ్ళు ఉండటం నిజంగా సిగ్గుచేటు" అని రాశాడు.
ఇండియా బలం దాని భిన్నత్వం, కలుపుగోలుతనంలో ఉందని కూడా చెప్పాడు. "దీపావళి అనేది వెలుగు, అభివృద్ధి, ఐక్యత పండుగ. ఈ భావనలు నీ పరిమిత బుద్ధికి అందవు. భారతదేశ బలం ఎప్పుడూ దాని భిన్నత్వం, కలుపుగోలుతనంలోనే ఉంది. ఇది నీకు అర్థం కాదు. అజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం మానేసి నిన్ను నువ్వు కాస్త ఎదిగేలా చూసుకో. ఎందుకంటే ఇక్కడ నిజంగా అంటరానిది నీ ఆలోచనా విధానం మాత్రమే" అని శిఖర్ అన్నాడు.
గత ఏడాది నవంబర్‌లో శిఖర్ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటోలు పెట్టి.. "శ్రీరాముని రాక వెలుగు, శ్రేయస్సుతో కూడిన సంవత్సరాన్ని తీసుకురావాలి. చెడుపై మంచి విజయం సాధించాలి. మనకు అవసరమైన వారికి సహాయం చేయడానికి, పైకి తీసుకురావడానికి, రక్షించడానికి ఎల్లప్పుడూ ధర్మ మార్గాన్ని ఎంచుకునే బలం, జ్ఞానం ఉండాలి" అని రాశాడు.
ఎవరీ శిఖర్ పహారియా?
జాన్వీ కపూర్ బాయ్‌ఫ్రెండ్ అయిన శిఖర్.. మాజీ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. అతని తల్లి స్మృతి షిండే ఒక నటి. అతని అన్నయ్య వీర్ పహారియా ఈ మధ్యే స్కై ఫోర్స్ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, నిమ్రత్ కౌర్, సారా అలీ ఖాన్ కూడా నటించారు.
శిఖర్, జాన్వీ తాము డేటింగ్ చేస్తున్నట్లు ఎప్పుడూ చెప్పకపోయినా, వాళ్లు తరచుగా కలిసి ఈవెంట్స్ కు వెళ్తుంటారు. ఆమె జూనియర్ ఎన్టీఆర్‌తో దేవర: పార్ట్ 1లో కనిపించగా.. ప్రస్తుతం రామ్ చరణ్‌తో ఆర్సీ 16, సిద్ధార్థ్ మల్హోత్రాతో పరమ్ సుందరి, వరుణ్ ధావన్‌తో సన్నీ సంస్కారీ కి తులసి కుమారి సినిమాల్లో నటిస్తోంది.
సంబంధిత కథనం