Avatar 2 Box Office Collections: అవతార్ 2 అరుదైన రికార్డు.. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఘనత
Avatar 2 Box Office Collections: జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన అవతార్ 2 అరుదైన ఘనత సాధించింది. గతేడాది అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. మొత్తంగా 1.516 బిలియన్ డాలర్లతో దూసుకెళ్లింది.
Avatar 2 Box Office Collections: హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామేరూన్ దర్శకత్వంలో రూపొందిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ చిత్రం వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. విడుదలై 21 రోజులైనా కలెక్షన్ల పరంగా అబ్బురపరుస్తోంది. తాజాగా ఈ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అవతార్ 2 ప్రపంచ వ్యాప్తంగా 1.516 బిలియన్ డాలర్లను(రూ.12,505) వసూలు చేసింది. ఫలితంగా 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. గతేడాది వసూళ్ల వర్షాన్ని కురిపించిన టామ్ క్రూజ్ చిత్రం టాప్ గన్ మ్యావ్రిక్‌ను అధిగమించింది.
ట్రెండింగ్ వార్తలు
హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ మ్యావ్రిక్ 1.4 బిలియన్ డాలర్లను వసూలు చేయగా.. అవతార్ 2 మాత్రం 1.516 బిలియన్ డాలర్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అవతార్ 2 అమెరికా, కెనడాలో కలిపి 464 మిలియన్ డాలర్లను వసూలు చేయగా.. ఇతర ప్రపంచ దేశాలన్నింటిలో కలిపి 1.05 బిలియన్ డాలర్లతో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. అమెరికా తర్వాత చైనాలో 168 మిలియన్లను(రూ.1392 కోట్లు) వసూలు చేసింది. చైనా తర్వా ఫ్రాన్స్‌లో 96 మిలియన్ డాలర్లను(రూ.793 కోట్లు), దక్షిణ కొరియా నుంచి 78.2 మిలియన్ డాలర్లను(రూ.645 కోట్లు) వసూలు చేసింది.
జర్మనీలో అవతార్ చిత్రానికి రూ.76.5 మిలియన్ డాలర్లు రాగా.. యూకే నుంచి 60.9 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. విడుదలైన 14 రోజుల్లోనే బిలియన్ డాలర్ మార్కును అందుకున్న అవతార్ 2 అత్యంత వేగంగా ఈ మైలురాయిని సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. టాప్ గన్ చిత్రానికి ఈ ఘనత సాధించడానికి 31 రోజుల సమయం పట్టింది. టాప్ గన్ తర్వాత జురాసిక్ వరల్డ్ డొమినియన్ మూవీ 1.003 బిలియన్ మార్కును అందుకుంది. ఈ సినిమాకు మూడు నెలల సమయం పట్టింది.
ఈ రకంగా చూసుకుంటే ఇప్పటికే అవతార్ 2 సినిమా 1.5 బిలియన్ డాలర్లను అధిగమించడంతో 2 బిలియన్ మార్కును(రూ.16,511 కోట్లు) సులభంగా అందుకునేలా ఉంది. దీంతో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సంబంధిత కథనం