Jalsa Special Show: తెలుగు రాష్ట్రాల్లో జల్సా స్పెషల్ షోలు.. పవర్‌స్టార్ పుట్టినరోజు ప్రత్యేకం..!
Jalsa Special Show: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన జల్సా సినిమా 2008లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మరోసారి ప్రదర్శించనున్నారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లోనూ విడుదల చేయనున్నారు.

Jalsa Special Show: తెలుగునాట పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మేనరిజం, స్టైల్, పర్ఫార్మెన్స్‌కు యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఏదో సినిమాలో అన్నట్లు మార్కెట్లో ఆయన క్రేజ్ చూస్తే మెంటల్ వస్తుంది అనేలా పవర్‌స్టార్ సినిమాలకు ఓపెనింగ్స్ ఉంటాయి. ఇప్పటికే పవనిజం అనే పేరుతో ఆయనను అభిమానులు ఆయనను ఫాలో అవుతున్నారు. ఇంక పవర్‌స్టార్ పుట్టినరోజు వస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సెప్టెంబరు 22న పవన్ కల్యాణ్ బర్త్‌డే రానుంది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన సినిమాలను పునఃప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే తమ్ముడు సినిమా ప్రదర్శనకు రెడీ కాగా.. తాజాగా జల్సా సినిమా కూడాను ప్రదర్శించనున్నారు.
పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా చిత్రాన్ని దాదాపు 500 స్క్రీన్లలో మరోసారి విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను వీలైనంత భారీగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో మరోసారి అభిమానులు థియేటర్లలో జల్సా చేసేందుకు రెడీ అయిపోతున్నారు.
ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగు వారు ఎక్కువగా ఉంటున్న యూఎస్ఏ, ఆస్ట్రేలియాల్లోనూ ఈ చిత్రాన్ని మరోసారి ప్రదర్శించనున్నారు. ఇదే బాటలో తమ్ముడు స్పెషల్ షోలను కూడా నిర్వహించనున్నారు. దీంతో సెప్టెంబరు 2 వరకు పవన్ మేనియా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ కొనసాగనుంది.
ప్రస్తుతం పవర్‌స్టార్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో భవధీయుడు భగత్ సింగ్ అనే చిత్రాలను చేస్తున్నారు. హరిహర వీరమల్లు అయితే ఇప్పటికే సగం షూటింగ్ కూడా పూర్తయింది. దీనికోసం పవన్ ప్రత్యేకంగా కసరత్తులు ప్రారంభించారు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్