Jailer VS Bhola Shankar: నాకు నేనే పోటీ అంటోన్న మిల్కీ బ్యూటీ - ఒక్క రోజు గ్యాప్‌లో త‌మ‌న్నా రెండు సినిమాలు రిలీజ్‌-jailer vs bhola shankar tamannaah two movies arriving in theaters in one day gap ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Jailer Vs Bhola Shankar Tamannaah Two Movies Arriving In Theaters In One Day Gap

Jailer VS Bhola Shankar: నాకు నేనే పోటీ అంటోన్న మిల్కీ బ్యూటీ - ఒక్క రోజు గ్యాప్‌లో త‌మ‌న్నా రెండు సినిమాలు రిలీజ్‌

HT Telugu Desk HT Telugu
May 13, 2023 06:54 AM IST

Tamannaah Jailer VS Bhola Shankar: 2023 త‌మ‌న్నాకెరీర్‌లో స్సెష‌ల్ ఇయ‌ర్‌గా నిల‌వ‌బోతున్న‌ది. త‌న సినిమాతో తానే బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌బోతున్న‌ది. త‌మ‌న్నా న‌టించిన రెండు భారీ బ‌డ్జెట్ సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌లో రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే...

త‌మ‌న్నా
త‌మ‌న్నా

Tamannaah Jailer VS Bhola Shankar: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఒక్క రోజు గ్యాప్‌లో రెండు భారీ బ‌డ్జెట్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ర‌జ‌నీకాంత్ జైల‌ర్ మూవీలో త‌మ‌న్నాకీల‌క‌ పాత్ర‌లో న‌టిస్తోంది. ఆగ‌స్ట్ 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే చిరంజీవి హీరోగా న‌టిస్తోన్న భోళా శంక‌ర్ మూవీలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా ఆగ‌స్ట్ 11న రిలీజ్ కానుంది.

ఈ బాక్సాఫీస్ ఫైట్‌లో త‌న సినిమాతో తానే పోటీప‌డ‌బోతున్న‌ది త‌మ‌న్నా. ఆమె న‌టించిన సినిమాలు ఒక రోజు వ్య‌వ‌ధిలో రిలీజ్ కావ‌డం కెరీర్‌లో ఇదే తొలిసారి. జైల‌ర్ సినిమాకు నెల్స‌న్ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో ర‌జ‌నీకాంత్‌తో పాటు మోహ‌న్‌లాల్‌, శివ‌రాజ్‌కుమార్‌తో పాటు ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు.

ర‌జ‌నీకాంత్‌తో త‌మ‌న్నా తొలిసారి న‌టిస్తోన్న సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఇందులో త‌మ‌న్నా ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు భోళా శంక‌ర్ సినిమాలో త‌మ‌న్నా లాయ‌ర్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. చిరంజీవి హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

వేదాళం రీమేక్‌గా అన్నాచెల్లెళ్ల అనుబంధం నేప‌థ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. ప్ర‌స్తుతం కోల్‌క‌తాలో చిరంజీవి, త‌మ‌న్నాల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తోన్నారు. వీటితో పాటుగా త‌మ‌న్నా ప్ర‌స్తుతం హిందీలో ల‌స్ట్ స్టోరీస్ 2 లో న‌టిస్తోంది. ఇందులో విజ‌య్ వ‌ర్మ స‌ర‌స‌న‌ త‌మ‌న్నా న‌టిస్తోంది.

ఈ సినిమా షూటింగ్‌లోనే విజ‌య్ వ‌ర్మ‌తో త‌మ‌న్నా ప్రేమ‌లో ప‌డ్డ‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ జంట చెట్ట‌ప‌ట్టాలేసుకొని తిరుగుతోన్న ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అవుతోన్నాయి. బాంద్రా సినిమాతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది త‌మ‌న్నా.

IPL_Entry_Point