Comedy OTT: ఓటీటీలోకి జైలర్ విలన్ మలయాళం సెటైరికల్ కామెడీ మూవీ - రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్!
Comedy OTT: జైలర్ విలన్ వినాయకన్ హీరోగా నటించిన మలయాళం మూవీ తెక్కు వడక్కు ఈ వారంలోనే ఓటీటీప్రేక్షకుల ముందుకు వస్తోంది. నవంబర్ 19 నుంచి మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాలో సూరజ్ వెంజరమూడు మరో హీరోగా నటించాడు.
Comedy OTT: జైలర్ ఫేమ్ వినాయకన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళం కామెడీ డ్రామా మూవీ తెక్కు వడక్కు ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. ఈ కామెడీ మూవీ నవంబర్ 19 నుంచి మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అదే రోజు సింప్లీ సౌత్ ఓటీటీలో కూడా ఈ మలయాళం మూవీ రిలీజ్ అవుతోంది.
ఈగో కాన్సెప్ట్...
తెక్కు వడక్కు మూవీలో వినాయకన్‌తో పాటు సూరజ్ వెంజరమూడు మరో హీరోగా నటించాడు. ఈగో ఇష్యూస్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. వినాయకన్, సూరజ్ యాక్టింగ్ బాగున్నా...కాన్సెప్ట్ ఆకట్టుకోలేకపోవడం, కామెడీ అంతగా వర్కవుట్ కాకపోవడంతో తెక్కు వడక్కు ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. ఈ సినిమాకు సామ్ సీఏస్ మ్యూజిక్ అందించాడు.
రిటైర్డ్ ఉద్యోగి వర్సెస్ రైస్ మిల్ ఓనర్...
రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగికి, రైస్ మిల్ ఓనర్‌కు మధ్య భూమి విషయంలో మొదలైన ఈగో సమస్యల నేపథ్యంలో సెటైరికల్ కామెడీ మూవీగా దర్శకుడు తెక్కు వడక్కు సినిమాను రూపొందించాడు. మాధవన్(వినాయకన్) ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అవుతాడు, శాన్‌కున్ని (రైస్‌కున్ని) రైస్ మిల్ నడుపుతుంటాడు.
ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. వారి కుటుంబాల మధ్య ఉన్న చిన్నపాటి భూమి తగాదా కారణంగా శత్రువులగానే పెరుగుతారు. తండ్రుల టైమ్‌లో మొదలైన భూమి గొడవను శాన్‌కున్ని, మాధవన్ కొనసాగిస్తుంటారు. ఈ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు స్నేహితులు చేసిన ప్రయత్నాలేవి ఫలించవు. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచారు? ఆ భూమి వినాయన్, శాన్‌కున్నిలో ఎవరికి దక్కింది? అన్నదే ఈ మూవీ కథ.
సూపర్ హిట్ మూవీస్…
సొసైటీలో జరిగే యదార్థ సంఘటనల నుంచి స్ఫూర్తి పొందుతూ దర్శకుడు ప్రేమ్‌కుమార్ తెక్కు వడక్కు మూవీని తెరకెక్కించాడు. థియేటర్లలో తెక్కు వడక్కు కోటిలోపే వసూళ్లను రాబట్టింది. ఈగో కాన్సెప్ట్‌తో మలయాళంలో అయ్యప్పనుమ్ కోషియమ్, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు పలు సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. అవన్నీ సీరియస్‌గా సాగగా...తెక్కు వడక్కు కామెడీతో భిన్నంగా తెరకెక్కింది. కానీ ఈ ప్రయోగం అంతగా ఫలించలేదు.
ఒకే ఒక తెలుగు మూవీ...
రజనీకాంత్ జైలర్‌లో విలన్‌గా తన నటనతో దక్షిణాది ప్రేక్షకులను మెప్పించాడు వినాయకన్. మలయాళంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు విజయవంతమైన సినిమాలు చేశాడు. తెలుగులో వినాయకన్ ఒకే ఒక సినిమాలో నటించాడు. కళ్యాణ్ రామ్ అసాధ్యుడు మూవీలో విలన్‌గా కనిపించాడు.
సూరజ్ వెంజరమూడు డిఫరెంట్ రోల్స్‌తో మలయాళంలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు.