Jailer 100 Crore Club in Telugu: తెలుగులో జైలర్ రేర్ ఫీట్ - వంద కోట్ల క్లబ్‌కు చేరువలో రజనీ మూవీ
Jailer 100 Crore Club in Telugu: రజనీకాంత్ జైలర్ మూవీ తెలుగులో ఓ అరుదైన రికార్డ్‌కు చేరువైంది. వంద కోట్ల క్లబ్‌కు చేరువైంది. తెలుగు వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన మూడో డబ్బింగ్ మూవీగా జైలర్ నిలవనుంది.
Jailer 100 Crore Club in Telugu: జైలర్ మూవీ రిలీజై 18 రోజులు అవుతోన్న వసూళ్ల జోరు మాత్రం తగ్గడం లేదు. ఆదివారం నాటితో వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 600 కోట్ల కుపైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా తెలుగులో ఈ మూవీ అరుదైన రికార్డుకు నెలకొల్పడానికి అడుగు దూరంలో ఉంది. వంద కోట్ల మైలురాయికి చేరువైంది. ఆదివారం నాటి తో ఈ మూవీ తెలుగులో 95 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వారం రిలీజైన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ వీక్ కూడా జైలర్ సినిమాకు ఎదురులేకుండాపోయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ మరో రెండు మూడు రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు తెలుగు డబ్బింగ్ సినిమాల్లో రజనీకాంత్ 2.ఓ తో పాటు యశ్ కేజీఎఫ్ 2 మాత్రమే వంద కోట్ల మైలురాయిని దాటాయి.
ఈ ఘనతను సాధించిన మూడో సినిమాగా రజనీకాంత్ జైలర్ నిలవనుంది. అంతే కాకుండా ఈ రేర్ ఫీట్‌ను తెలుగులో రెండు సార్లు అందుకున్న ఏకైక హీరోగా రజనీకాంత్ నిలవబోతున్నాడు. తెలుగులో ఈ సినిమాను దిల్‌రాజు, ఏషియన్ సునీల్‌లతో కలిసి రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు.
కేవలం 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ నిర్మాతలకు నాలుగింతల లాభాల్ని మిగిల్చింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించాడు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ అతిథి పాత్రల్లో కనిపించారు. రమ్యకృష్ణ, మిర్నా మీనన్, సునీల్, తమన్నా కీలక పాత్రలు పోషించారు