Jailer Release Date: రజనీకాంత్ జైలర్ రిలీజ్ డేట్ ఇదే.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే-jailer release date announced by the makers today may 4th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Jailer Release Date Announced By The Makers Today May 4th

Jailer Release Date: రజనీకాంత్ జైలర్ రిలీజ్ డేట్ ఇదే.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే

Hari Prasad S HT Telugu
May 04, 2023 06:45 PM IST

Jailer Release Date: రజనీకాంత్ జైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్తను మేకర్స్ గురువారం (మే 4) అందించారు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

జైలర్ మూవీలో రజనీకాంత్
జైలర్ మూవీలో రజనీకాంత్

Jailer Release Date: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ గురువారం (మే 4) రివీల్ చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ రిలీజ్ విషయాన్ని సన్ పిక్చర్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది.

ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎంతో బజ్ క్రియేట్ చేస్తోంది. జైలర్ మూవీలో రజనీతోపాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ్ స్టార్ శివ రాజ్‌కుమార్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సౌతిండియాలోని మూడు భాషల స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తుండటంతో జైలర్ మూవీకి మరింత హైప్ వచ్చింది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, టాలీవుడ్ కమెడియన్ సునీల్ కూడా నటించారు.

రిలీజ్ డేట్ అనౌన్స్ సందర్భంగా ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. మూవీలోని ప్రధాన క్యారెక్టర్లను ఇందులో చూపించారు. మొదట్లో ఫాస్ట్ ఫాస్ట్ గా జైలర్ మూవీలోని క్యారెక్టర్స్ ను ఇంట్రడ్యూస్ చేయగా.. చివర్లో సూపర్ స్టార్ ఎంట్రీ సీన్ అదిరిపోయేలా చూపించారు. రజనీ తనదైన స్టైల్లో కాలితో కారు డోరు తెరిసి, బయటకు దిగి ఓ స్మైల్ ఇచ్చాడు.

ఈ గ్లింప్స్ లో రజనీకాంత్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. మూవీ కోసం అతడి మేకోవర్ చాలా బాగుంది. ఆగస్ట్ లో ఇండిపెండెన్స్ డే హాలీడేతో కలిపి లాంగ్ వీకెండ్ రావడంతో మేకర్స్ ఆగస్ట్ 10ని రిలీజ్ డేట్ గా ఎంచుకున్నారు. దీంతో మూవీకి మంచి ఓపెనింగ్ కలెక్షన్లు ఖాయంగా కనిపిస్తున్నాయి. జైలర్ లో తమన్నా, రమ్యక్రిష్ణ కూడా నటిస్తున్నారు. అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. ఈ జైలర్ మూవీతో సూపర్ స్టార్ మళ్లీ గాడిలో పడతాడేమో చూడాలి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్