Jailer Success: కొనసాగుతున్న జైలర్ సెలెబ్రేషన్స్.. వారికి గోల్డ్ కాయిన్స్: వీడియో-jailer producer kalanithi maran felicitated more than 300 people with gold coins ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Jailer Producer Kalanithi Maran Felicitated More Than 300 People With Gold Coins

Jailer Success: కొనసాగుతున్న జైలర్ సెలెబ్రేషన్స్.. వారికి గోల్డ్ కాయిన్స్: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 10, 2023 07:09 PM IST

Jailer Success: జైలర్ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్ ఇంకా కొనసాగుతున్నాయి. ఈ చిత్రం కోసం పని చేసిన 300 మందికి పైగా వ్యక్తులకు బంగారు కాయిన్లను అందించారు నిర్మాత.

Jailer Success: కొనసాగుతున్న జైలర్ సెలెబ్రేషన్స్.. వారికి గోల్డ్ కాయిన్స్: వీడియో
Jailer Success: కొనసాగుతున్న జైలర్ సెలెబ్రేషన్స్.. వారికి గోల్డ్ కాయిన్స్: వీడియో

Jailer Success: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ చిత్రం బ్లాక్‍బాస్టర్ అయింది. కలెక్షన్ల సునామీ సృష్టించి చాలా రికార్డులను బద్దలుకొట్టింది. ఆగస్టు 10న రిలీజైన జైలర్ మూవీ ఆరంభం నుంచి అంచనాలకు మించి వసూళ్లను రాబట్టింది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.650కోట్ల గ్రాస్ కలెక్షన్లకు సమీపించింది. దీంతో జైలర్ చిత్ర నిర్మాత కళానిధి మారన్ సెలెబ్రేషన్స్ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమా కోసం పని చేసిన వారికి బహుమతులు ఇస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

జైలర్ చిత్రం కోసం పని చేసిన 300 మందికిపైగా వ్యక్తులకు నేడు బంగారు కాయిన్స్ ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్. వారికి విందు ఇచ్చారు. ఇందుకోసం ఓ ఈవెంట్‍ను నిర్వహించారు. భారీ కేక్ కట్ చేశారు. గోల్డ్ కాయిన్స్ ఇచ్చాక వారితో కలిసి కూర్చొని భోజనం చేశారు నిర్మాత కళానిధి మారన్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. ఇందుకు సంబంధించిన వీడియోను సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 300 మందికిపైగా వ్యక్తులను గోల్డ్ కాయిన్లతో నిర్మాత సన్మానించారని పేర్కొంది.

జైలర్ చిత్రంలో హీరోగా నటించిన తలైవా రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌కు లగ్జరీ కార్లు బహుమతిగా ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్. రజినీ, అనిరుధ్‍కు చెక్‍లను కూడా ఇచ్చారు. తలైవాకు భారీ మొత్తంలో చెక్ రూపంలో ఇచ్చారని సమాచారం.

జైలర్ చిత్రంలో వినాయకన్ విలన్‍గా నటించగా.. వసంత్ రవి, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, యోగిబాబు, సునీల్ కీలకపాత్రలు చేశారు. సీనియర్ స్టార్ నటులు మోహన్‍లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ క్యామియోలు చేశారు.

కాగా, జైలర్ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. భారత్ సహా మరికొన్ని దేశాల్లోనూ ప్రైమ్ వీడియోలో జైలర్ ప్రస్తుతం ట్రెండింగ్‍లో ఉంది.

జైలర్ సినిమా ఓటీటీలోకి వచ్చినా ఇప్పటికీ థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. తమిళనాడులోని కొన్ని థియేటర్లలో ఇప్పటికీ జైలర్ సినిమాకు మోస్తరు ఆక్యుపెన్సీ ఉంటున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు ఇంకా కొనసాగుతున్నాయి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.