Jailer HD print leaked: ఓటీటీ రిలీజ్ కంటే ముందే జైలర్ హెచ్‌డీ ప్రింట్ లీక్-jailer hd print leaked online before its ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Jailer Hd Print Leaked Online Before Its Ott Release

Jailer HD print leaked: ఓటీటీ రిలీజ్ కంటే ముందే జైలర్ హెచ్‌డీ ప్రింట్ లీక్

Hari Prasad S HT Telugu
Aug 30, 2023 08:33 AM IST

Jailer HD print leaked: ఓటీటీ రిలీజ్ కంటే ముందే జైలర్ హెచ్‌డీ ప్రింట్ లీక్ అయింది. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తున్న ఈ సినిమా ఆన్‌లైన్లో లీకవడంపై మేకర్స్ ఆందోళన వ్యక్తం చేశారు.

జైలర్ సినిమాలో తమన్నా, రజినీ కాంత్
జైలర్ సినిమాలో తమన్నా, రజినీ కాంత్

Jailer HD print leaked: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసిన విషయం తెలుసు కదా. రిలీజై మూడు వారాలు అవుతున్నా.. ఇప్పటికీ మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోకి కూడా రాబోతోంది. అయితే అంతకంటే ముందే ఈ మూవీ హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్ లో లీకవడం ఆందోళన కలిగిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవడంతో జైలర్ మూవీతో ఓటీటీలోనూ అదే రేంజ్ లో రికార్డులు బ్రేక్ చేస్తుందని భావించారు. అయితే ఇప్పుడీ మూవీ లీకవడంతో ఎంతోకొంత డ్యామేజీ తప్పదని మేకర్స్ భావిస్తున్నారు. జైలర్ మూవీ హక్కులను పొందడానికి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.100 కోట్లు చెల్లించింది. ఈ లీక్ కారణంగా ఆ ఓటీటీకి నష్టాలు తప్పవు.

జైలర్ మూవీ హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్ లో లీకైన విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. దీనిపై అతడు షాక్ వ్యక్తం చేశాడు. అసలు ఎలాంటి వాటర్‌మార్క్స్ లేకుండా ఒరిజినల్ హెచ్‌డీ ప్రింట్, ఒరిజినల్ 5.1 సరౌండ్ సౌండ్ తో లీక్ కావడం గమనార్హం. ఇది అటు థియేటర్ ఓనర్లను, ఇటు ఓటీటీని ఆందోళనకు గురి చేసింది.

తొలి రోజు నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్లింది. కేవలం ఇండియాలోనే ఇప్పటి వరకూ రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది రూ.600 కోట్లకుపైగానే కావడం విశేషం. సినిమా రిలీజైన 19వ రోజు ఈ రికార్డులు బ్రేకయ్యాయి. ఆగస్ట్ 10న జైలర్ మూవీ రిలీజైన విషయం తెలిసిందే.

మరోవైపు జైలర్ మూవీ రిలీజ్ రోజే హిమాలయాలకు వెళ్లిన రజనీకాంత్.. మంగళవారం (ఆగస్ట్ 29) నాడు తాను ఒకప్పుడు బస్సు కండక్టర్ గా పని చేసిన డిపోకు వెళ్లాడు. అక్కడి సిబ్బందితో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.