Jailer first glipmse: జైలర్‌ ముత్తువేల్‌ పాండ్యన్‌ వచ్చేశాడు.. రజనీ లుక్‌ అదుర్స్‌-jailer first glipmse release on the occasion of rajini kanth birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Jailer First Glipmse Release On The Occasion Of Rajini Kanth Birthday

Jailer first glipmse: జైలర్‌ ముత్తువేల్‌ పాండ్యన్‌ వచ్చేశాడు.. రజనీ లుక్‌ అదుర్స్‌

HT Telugu Desk HT Telugu
Dec 12, 2022 06:47 PM IST

Jailer first glipmse: జైలర్‌ ముత్తువేల్‌ పాండ్యన్‌ వచ్చేశాడు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ బర్త్‌డే సందర్భంగా జైలర్‌ మూవీ టీమ్‌ నుంచి ఓ గ్లింప్స్‌ వీడియో వచ్చింది.

జైలర్ మూవీలో రజనీకాంత్
జైలర్ మూవీలో రజనీకాంత్

Jailer first glipmse: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మరో మ్యాజిక్‌ చేయడానికి వచ్చేస్తున్నాడు. ఈసారి జైలర్‌ ముత్తువేల్‌ పాండ్యన్‌ క్యారెక్టర్‌లో అదరగొట్టనున్నాడు. సోమవారం (డిసెంబర్‌ 12) రజనీ బర్త్‌డే సందర్భంగా జైలర్‌ టీమ్‌ అతని క్యారెక్టర్‌కు సంబంధించి ఓ గ్లింప్స్‌ రిలీజ్‌ చేసింది. ఒక నిమిషం 40 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో రజనీ చాలా కూల్‌గా కనిపించాడు.

ఓ డార్క్‌ రూమ్‌లో రజనీ తన షూ లేసెస్‌ కట్టుకుంటూ ఎంట్రీ ఇస్తాడు. కళ్లద్దాలు పెట్టుకొని, పెర్ఫ్యూమ్‌ కొట్టుకొని చివర్లో కొడవలి తీస్తూ రజనీ కనిపిస్తాడు. ఈ వీడియోకు అనిరుద్ధ్‌ రవిచందర్‌ అందించిన మ్యూజిక్‌ కూడా హైలైట్ అని చెప్పాలి. జైలర్‌ మూవీని నిర్మిస్తున్న సన్‌ పిక్చర్స్‌ ఈ వీడియోను తన ట్విటర్‌లో షేర్ చేసింది.

"ముత్తువేల్‌ పాండ్యన్‌ వచ్చేశాడు! హ్యాపీ బర్త్‌డే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌" అని సన్‌ పిక్చర్స్‌ ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. అటు ఈ మూవీ డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్ కుమార్‌ కూడా రజనీకి బర్త్‌డే విషెస్‌ చెప్పాడు. "అత్యంత వినయపూర్వకమైన, శక్తివంతమైన, ఆకర్షణీయమైన వ్యక్తి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు" అని నెల్సన్‌ ట్వీట్‌ చేశాడు.

సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఈ గ్లింప్స్‌ వీడియో రిలీజ్ కానున్నట్లు అంతకుముందు మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుద్ధ్‌ రవిచందర్‌ వెల్లడించాడు. ఈ సందర్భంగా రజనీకి బర్త్‌ డే విషెస్‌ కూడా చెప్పాడు. రజనీ సోమవారం (డిసెంబర్‌ 12) తన 73వ పుట్టిన రోజు జరుపుకున్నాడు.

విజయ్‌తో కలిసి బీస్ట్‌ మూవీ తీసిన నెల్సన్‌ దిలీప్‌కుమార్‌తో తొలిసారి రజనీకాంత్‌ ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో రజనీతోపాటు శివ రాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ, వసంత్‌ రవి, యోగి బాబు, వినాయకన్‌ నటిస్తున్నారు. రజనీతో కలిసి నరసింహ మూవీలో తన నట విశ్వరూపం చూపించిన రమ్యకృష్ణ మరోసారి అతనితో కలిసి నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

IPL_Entry_Point

టాపిక్