Jailer Collections Day 9 : జైలర్ మూవీ కలెక్షన్స్.. రికార్డులకు అమ్మ మెుగుడు సూపర్ స్టార్
Jailer Box Office Collections Day 9 : సూపర్‌స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమా థియేటర్లలో దూసుకెళ్తోంది. రికార్డులు బద్దలు కొట్టే దిశగా వెళ్తోంది. ఇప్పటికే తమిళనాడులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించింది.
సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth) బాక్సాఫీసును షేక్ చేస్తున్నాడు. ఇప్పటికే తమిళనాడులో అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రంగా జైలర్ నిలిచింది. మెుదటి రోజు నుంచి జైలర్ కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. అస్సలు ఎక్కడా తగ్గట్లేదు. గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదలైన మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని అధిగమించే దిశగా నడుస్తోంది రజనీకాంత్ జైలర్. మరిన్ని వసూళ్లు రాబడుతుంది.
అంచనాల ప్రకారం రజనీకాంత్ జైలర్(Jailer) భారతదేశంలో తొమ్మిదో రోజు వరకు మొత్తం కలెక్షన్ రూ.244.85 కోట్లకు చేరుకుంది. Sacnilk.com నివేదిక ప్రకారం ఈ చిత్రం 10వ రోజు శనివారం నాటికి భారతదేశంలో రూ.16 కోట్లు రాబట్టవచ్చు. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల ప్రకారం జైలర్ 'తమిళనాడులో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా దూసుకుపోతోంది'.
హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఆగస్ట్ 10 విడుదలైన ఈ తమిళ చిత్రం రూ.48.35 కోట్ల వసూళ్లతో ప్రారంభమైంది. తర్వాత కూడా ఎక్కడా తగ్గలేదు. ఆసక్తికర విషయం ఏంటంటే.. రజనీకాంత్ జైలర్(Rajinikanth Jailer) సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. Sacnilk.com తాజా నివేదిక ప్రకారం శనివారం వసూళ్లను కలుపుకొని.. బాక్సాఫీస్ కలెక్షన్(Jailer Box Office Collections)ను రూ. 261.60 కోట్లు దాటవచ్చు.
మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాను, కమల్ హాసన్ విక్రమ్(Kamal Haasan Vikram) గ్రాస్ కలెక్షన్‌ను అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించాలని చూస్తోంది జైలర్ సినిమా. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో జైలర్ విజయవంతమైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా దూసుకుపోతోంది. యుఎస్, యుఎఇ మార్కెట్లలో కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.
USAలో జైలర్ సినిమా 5 మిలియన్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్టుగా రమేశ్ బాలా ట్వీట్ చేశాడు. ఇప్పటికీ UAEలో జైలర్ నెం.1 స్థానంలో ఉందని పేర్కొన్నాడు. నిజానికి రజనీకాంత్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కమల్ హాసన్ 'విక్రమ్' చిత్రాన్ని అధిగమించింది. తమిళనాడులో అత్యధిక వసూళ్లు సాధించిన కొత్త చిత్రంగా కూడా దూసుకుపోతోంది.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రజనీకాంత్, వినాయకన్, రమ్యకృష్ణ, వసంత్ రవి, తమన్నా కీలక పాత్రలు పోషించారు. శివ రాజ్‌కుమార్(Shiva Rajkumar), మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్ అతిథి పాత్రల్లో కనిపించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందించాడు. వీటీవీ గణేష్, సునీల్, మిర్నా మీనన్, రిత్విక్, పలువురు నటీనటులు సినిమాలో ఉన్నారు.