రీ రిలీజ్‌లో చిరంజీవి బ్లాక్‌బస్టర్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి అదరగొడుతోంది. తెలుగులో రీ రిలీజైన సీనియర్ హీరోల సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా ఐదు రోజుల్లో ఈ మూవీ 2.90 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
ఆంధ్రాలో కోటి ఐదు లక్షలు, నైజాంలో కోటి వసూళ్లు వచ్చాయి. ఓవర్‌సీస్‌లో కూడా కమ్మేసిన ఈ మూవీ 55 లక్షల కలెక్షన్స్ దక్కించుకున్నది. సీడెడ్‌లో 30 లక్షల వరకు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
వీక్ డేస్‌లో కూడా జగదేకవీరుడు, అతిలోక సుందరి వసూళ్లతో అదరగొట్టింది. సోమ, మంగళవారాల్లో కలిపి ఈ మూవీ నలభై లక్షల వరకు కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు చెబుతోన్నారు. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ మూడు కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
తెలుగు రీ రిలీజ్ మూవీస్‌లో మహేష్‌బాబు మురారి 8.90 కోట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఎనిమిది కోట్లతో గబ్బర్ సింగ్ సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది. 7.50 కోట్లతో ఖుషి మూడో స్థానాన్ని దక్కించుకున్నది.
కాగా టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాల్లో ఇంద్ర 3.38 కోట్లతో టాప్‌లో నిలిచింది. ఇంద్ర తర్వాత సెకండ్ ప్లేస్‌లో ప్రస్తుతం జగదేక వీరుడు అతిలోక సుందరి కొనసాగుతోంది. ఇంద్ర రికార్డును జగదేక వీరుడు అతిలోక సుందరి అధిగమించే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీకి కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శ్రీదేవి హీరోయిన్‌గా నటించింది. 1990లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆ టైమ్‌లో టాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 10 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. ఐదు నంది అవార్డులను సొంతం చేసుకున్నది. మ్యూజికల్‌గా ఈ మూవీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. . ఇళయరాజా అందించిన పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి.
దేవకన్యతో ప్రేమలో పడిన ఓ సామాన్య యువకుడి కథతో డైరెక్టర్ కే రాఘవేంద్రరావు జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీని తెరకెక్కించాడు. అమ్రీష్ పురి విలన్‌గా నటించిన ఈ మూవీలో కన్నడ ప్రభాకర్, రామిరెడ్డి, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు.
సంబంధిత కథనం