Jagadeesh in Pushpa 2 shooting: పుష్ప 2 సెట్స్‌లో జగదీశ్.. బెయిల్‌పై బయటకు వచ్చిన నటుడు-jagadeesh in pushpa 2 shooting after getting bail tollywood news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jagadeesh In Pushpa 2 Shooting: పుష్ప 2 సెట్స్‌లో జగదీశ్.. బెయిల్‌పై బయటకు వచ్చిన నటుడు

Jagadeesh in Pushpa 2 shooting: పుష్ప 2 సెట్స్‌లో జగదీశ్.. బెయిల్‌పై బయటకు వచ్చిన నటుడు

Hari Prasad S HT Telugu

Jagadeesh in Pushpa 2 shooting: పుష్ప మూవీతో పాపులర్ అయిన నటుడు జగదీశ్ ప్రతాప్ భండారీ బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతం అతడు పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

పుష్ప మూవీలో అల్లు అర్జున్ తో జగదీశ్

Jagadeesh in Pushpa 2 shooting: పుష్ప 2 మూవీ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ మూవీలో హీరో అల్లు అర్జున్ వెంటే ఉండే కేశవ పాత్ర పోషించిన జగదీశ్ ప్రతాప్ భండారీ పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ అమ్మాయిని ఆత్మహత్యకు పురిగొల్పాడన్న కేసులో అరెస్టయిన జగదీశ్.. బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చాడు.

పుష్ప 2 షూటింగ్ చేస్తున్నాడా?

పుష్ప మూవీలో అల్లు అర్జున్ పాత్ర ఎంత పేరు సంపాదించిందో ఆ మూవీ మొత్తం అతని వెంటే ఉంటూ తనదైన స్టైల్లో పుష్ప కథ చెప్పిన కేశవ పాత్ర కూడా అంతే పేరుగాంచింది. ఈ పాత్రలోనే జగదీశ్ కు పాపులారిటీ వచ్చింది. పుష్ప 2లోనూ అతని పాత్రకు ప్రాధాన్యత ఉంది. ఈ మూవీ షూటింగ్ లోనూ జగదీశ్ పాల్గొన్నాడు. అయితే సడెన్ గా అతని అరెస్ట్ వార్తలు మూవీ టీమ్ ను షాక్ కు గురి చేసింది.

దీంతో అతనిపై చిత్రీకరించాల్సిన సీన్లు వాయిదా పడ్డాయి. ఇప్పుడు బెయిలుపై బయటకు వచ్చిన జగదీశ్ పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటున్నాడని పింక్‌విల్లా రిపోర్టు వెల్లడించింది. అయితే దీనిపై టీమ్ నుంచి అధికారిక ప్రకటన ఏదీ లేదని కూడా స్పష్టం చేసింది. అతడు జైలుకి వెళ్లడం వల్ల పుష్ప 2 మూవీ మరింత ఆలస్యమైంది. రీషెడ్యూల్, రీషూట్లతో మూవీ ఇప్పటి వరకూ 50 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి చేసుకుంది.

జగదీశ్ ఉండటం కరెక్టేనా?

తమ మూవీ కోసం జగదీశ్ ను బెయిలుపై పుష్ప మూవీ టీమే బయటకు తీసుకొచ్చినట్లు కూడా సమాచారం. అయితే ఓ అమ్మాయిని ఆత్మహత్యకు పురిగొల్పాడన్న తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మూవీలో నటింపజేయడం సరైనదేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ లో భాగంగా గంగమ్మ జాతర సీక్వెన్స్ తీస్తున్నారు.

ఈ షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. పుష్ప ది రూల్ మూవీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలోనే ప్రత్యేక సెట్ వేసిన విషయం తెలిసిందే. గతేడాది ఇన్‌స్టాగ్రామ్ తో కలిసి అల్లు అర్జున్ తమ పుష్ప ప్రపంచంలోకి మనల్ని కూడా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 15న పుష్ప 2 రిలీజ్ కావాల్సి ఉంది. రిలీజ్ వాయిదా తప్పదన్న వార్తల మధ్య మూవీ టీమ్ మాత్రం పదేపదే ఆగస్ట్ 15నే రిలీజ్ అని కన్ఫమ్ చేస్తోంది.

మరోవైపు ఈ సినిమాలో కేశవ పాత్రలో కనిపించే జగదీశ్ ను గతేడాది డిసెంబర్ 6న పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళకు సంబంధించిన ఫొటోలను బయట పెడతానని జగదీశ్ బెదిరించడం, దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం అతని అరెస్టుకు దారి తీసింది. చనిపోయిన సదరు మహిళ షార్ట్ ఫిల్మ్స్ లో పని చేసేదని, జగదీశ్ తో రిలేషన్షిప్ లో ఉండేదని వార్తలు వచ్చాయి.