సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన జాక్ మూవీ అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్పై యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. మే సెకండ్ వీక్‌లో జాక్ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
తాజాగా సమాచారం ప్రకారం థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. మే 1న జాక్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్నట్లు చెబుతోన్నారు. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది.
జాక్ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఈ స్పై యాక్షన్ మూవీలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా వైష్ణవి చైతన్య నటించింది. ఈ ఏడాది భారీ అంచనాలు రేకెత్తించిన సినిమాల్లో ఒకటిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన జాక్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాదాపు 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఐదు కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. బడ్జెట్‌లో సగం కూడా రికవరీ సాధించలేకపోయిన ఈ మూవీ నిర్మాతలకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది.
దేశభక్తితో ముడిపడిన ఓ సీరియస్ పాయింట్‌తో ఫన్‌తో చెబుతూ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయాలనే దర్శకుడి ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. రా ఆఫీసర్ల, ఏజెన్సీపై సిల్లీగా చూపించడంపై దారుణంగా విమర్శలొచ్చాయి. జాక్ మూవీకి అచ్చు రాజమణి, సామ్ సీఎస్, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు.
జాక్ అలియాస్ పాబ్లో నెరుడా(సిద్దు జొన్నలగడ్డ) రిసెర్చ్ ఎనాలసిస్ వింగ్ (రా)లో జాయిన్ కావాలని కలలు కంటాడు. రా ఇంటర్వ్యూకు అటెండ్ అవుతాడు జాక్. జాబ్‌లో జాయిన్ కావడం కంటే ముందే ఏదైనా గొప్ప పనిచేయాలని అనుకుంటాడు.
హైదరాబాద్‌తో పాటు దేశంలోని మరికొన్ని నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తారు. . ఉగ్రవాదుల కుట్రలను ఓ స్లీపర్ సెల్ ద్వారా అడ్డుకుంటాడు జాక్. ఈ ప్రయత్నంలో అనుకోకుండా రా ఆఫీసర్ మనోజ్‌ను కిడ్నాప్ చేస్తాడు. ఈ సీక్రెట్ మిషన్ లో భాగంగా టెర్రిరిస్ట్ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి నేపాల్ వెళతాడు. అక్కడ జాక్‌కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి?
జాక్ చేసే పనుల వల్ల రా ఆఫీసర్ మనోజ్‌కు ఏ విధమైన ఇబ్బందులు ఎదురయ్యాయి? జాక్‌ను ఫాలో అవుతూ నేపాల్ వచ్చిన ఆఫ్షాన్ బేగం (వైష్ణవి చైతన్య) ఎవరు? మనోజ్ చంపేసిన టెర్రరిస్ట్ అవుతార్ రెహ్మాన్ ప్రాణాలతో ఎలా కనిపించాడు? తన మిషన్‌ను జాక్ ఎలా పూర్తిచేశాడు అన్నదే ఈ మూవీ కథ.
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన మూవీ ఇది. రెండు బ్లాక్‌బస్టర్స్ తర్వాత ఈ మూవీతో అతడి ఖాతాలో డిజాస్టర్ చేరింది. ప్రస్తుతం తెలుసు కదా మూవీతో పాటు మరో రెండు సినిమాలు చేస్తోన్నాడు సిద్ధు జొన్నలగడ్డ.
సంబంధిత కథనం