స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హీరోహీయిన్లుగా జాక్ చిత్రం వస్తోంది. ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామా చిత్రంపై మంచి హైప్ ఉంది. టిల్లు స్క్వేర్ మూవీతో ఈ ఏడాది భారీ హిట్ కొట్టారు సిద్ధు. బేబీ చిత్రంతో పాపులర్ అయ్యారు వైష్ణవి. వీరిద్దరూ జంటగా నటిస్తుంటంతో చాలా క్రేజ్ ఉంది. జాక్ సినిమా నుంచి నేడు (మార్చి 20) రెండో సాంగ్ రిలీజైంది.
జాక్ చిత్రం నుంచి కిస్ సాంగ్ అంటూ ఈ రెండో పాట వచ్చేసింది. లిరికల్ వీడియో రిలీజ్ అయింది. ముద్దు పెట్టుకునేందుకు ప్లేస్ కోసం వెతికే థీమ్‍తో ఈ పాట సాగుతుంది. ఎక్కడికి వెళ్లినా డిస్ట్రబెన్స్ ఉంటుంది. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో ఆకట్టుకునేలా ఉంది.
ఈ కిస్ పాటకు మంచి మెలోడియస్ ట్యూన్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి. ఈ సాంగ్‍ను జావేద్ అలీ, అమల చెబోలు పాడారు. లిరిక్స్ అందించారు సనారే. ఈ పాటకు రాజు సుందరం డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట ఆకట్టుకునేలా సాగింది. లిరిక్స్ ఇక్కడ చూడండి.
ఈ హైదరాబాద్ మొత్తంలో నాకంటూ ఓ ప్లేస్ లేకపోవడమా అని డైలాగ్ చెబుతూ వైష్ణవి చైతన్య చేయిపట్టుకొని సిద్ధు తీసుకెళ్లటంతో ఈ పాట షురూ అవుతుంది. లిరిక్స్ ఇవే..
భాగ్యనగరం అంతా..
మనదే.. మనదే
నీ బాధే తీరుస్తానే..
పదవే.. పదవే
జంటై పోదామందే..
పెదవే.. పెదవే
దునియాతో పని లేదింక.. పదవే.. పదవే
హే ముద్దు.. ముద్దుగా ముద్దివ్వమందిగా..
ముద్దుగుమ్మిలా ఉన్న పాటుగా..
ముద్దు పెట్టడం ఏమంత తేలికా
చుట్టుపక్కలంతా ఉండగా..
ఇంటికెళ్లి పెట్టుకుందామంటే..
నీకు నాకు ఇంకా పెళ్లి అవలే..
ఉన్న చోట తిప్పుతున్నావేంటోయ్
ప్రైవసీకి లేవా బెస్ట్ ప్లేసులే
వెన్నుపూస దాకా.. వణుకు వచ్చేలా.. ఇచ్చుకుందాం హాట్ ముద్దే
తొందరొద్దు బాగా గుర్తుండేలా ఎంచుకుందాం రొమాంటిక్ చోటే..
భాగ్యనగరం అంతా..
మనదే.. మనదే
నీ బాధే తీరుస్తానే..
పదవే.. పదవే
స్మోకింగ్ చేయగా.. స్మోక్ జోన్ ఉందిగా
కిస్‍కు లేదే కిస్సింగ్ జోన్
ఆల్కహాల్‍కే ఉందిలే వైన్ మార్ట్
ముద్దుకు లేదే సింగిల్ స్పాట్
ఆరోగ్యం చెడగొట్టే.. బ్యాడ్ హ్యాబిట్స్‌కే నెలవుందే
స్ట్రెస్ అంతా పోగొట్టే పెదవులకేంటీ ఇబ్బందే
భాగ్యనగరం అంతా..
మనదే.. మనదే
నీ బాధే తీరుస్తానే..
పదవే.. పదవే
ఊరిస్తున్నదే… వేధిస్తున్నదే
ఊహల నిండా నీ ముద్దే
జాగాలేదని.. జాగే చేయకే.. ప్రాణం పోతున్నట్టుందే..
అధరాలే అరిగేలా ఇవ్వాలని ఉందే చుమ్మా
మూడంతా చెదిరేలా వంకలు చెబుతావేంటమ్మా
భాగ్యనగరం అంతా..
మనదే.. మనదే
నీ బాధే తీరుస్తానే..
పదవే.. పదవే
ముద్దు పెట్టుకునేందుకు కోసం ప్రైవసీ ప్లేస్ కోసం వెతుకుతుంటే ప్రతీ చోట డిస్ట్రబెన్స్ ఎదురవడం చుట్టూ ఈ సాంగ్ సాగింది. సరదాగా, రొమాంటిక్‍గా ఉంది. మెలోడియస్‍గా ఉన్న ఈ సాంగ్ త్వరగా చార్ట్ బస్టర్ అయ్యేలా ఉంది.
ఏప్రిల్ 10వ తేదీని జాక్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు కావడం కూడా క్యూరియాసిటినీ పెంచుతోంది. ఈ సినిమాను బీవీఎస్‍ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలితో పాటు అచ్చు రాజమణి, సామ్ సీఎస్ కూడా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్