మరికొన్ని గంటల్లో ఓటీటీల్లోకి రెండు తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-jack and anchor pradeep akkada ammayi ikkada abbayi ott steaming netflix and etv win ott siddu jonnalagadda ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మరికొన్ని గంటల్లో ఓటీటీల్లోకి రెండు తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

మరికొన్ని గంటల్లో ఓటీటీల్లోకి రెండు తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఓటీటీల్లోకి మరికొన్ని గంటల్లో రెండు తెలుగు సినిమాలు వచ్చేస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ ఐదు భాషల్లో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. మరో తెలుగు మూవీ కూడా రానుంది. ఈ చిత్రాలను ఎక్కడ చూడొచ్చంటే..

మరికొన్ని గంటల్లో ఓటీటీల్లోకి రెండు తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఒకే రోజు రెండు తెలుగు సినిమాలు ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. థియేటర్లలో రిలీజైన నెలలోపే స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన జాక్ చిత్రం స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. మరికొన్ని గంటల్లో ఓటీటీల్లోకి అడుగుపెట్టనుంది. యాంకర్ ప్రదీప్ చిత్రం ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ కూడా ఓటీటీలోకి వచ్చేస్తోంది. వేర్వేరు ఓటీటీల్లో ఈ సినిమాలు రానున్నాయి. ఆ వివరాలు ఇవే..

జాక్

తెలుగు యాక్షన్ కామెడీ మూవీ ‘జాక్’ రేపు (మే 8) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ అర్ధరాత్రే అంటే మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్‍ షూరూ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. వైష్ణవి చైతన్య హీరోయిన్‍గా చేయగా.. ప్రకాశ్ రాజ్ ఓ కీలకపాత్ర పోషించారు.

ఏప్రిల్ 10వ తేదీన జాక్ చిత్రం థియేటర్లలో విడుదలైంది. మంచి క్రేజ్‍తో వచ్చి బాక్సాఫీస్ వద్ద చతిసిలపడింది. నెగెటివ్ టాక్‍తో పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది. రూ.30కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ రూ.10కోట్ల కలెక్షన్ల మార్క్ కూడా చేరలేకపోయింది. థియేటర్లలో రిలీజైన నెలలోగానే ఓటీటీలోకి జాక్ సినిమా వస్తోంది. మరికొన్ని గంటల్లోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసేవచ్చు.

జాక్ చిత్రానికి అచ్చు రాజమణి, సామ్ సీఎస్ మ్యూజిక్ ఇచ్చారు. ఎస్‍వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూజ్ చేశారు. జాక్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి రేవు వచ్చాక ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి

టీవీ యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమా రేపు (మే 8) ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రానికి భరత్, నితిన్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఏప్రిల్ 11న రిలీజైన ఈ మూవీకి నిరాశే ఎదురైంది. అంచనాలను అందుకోలేక ఆశించిన కలెక్షన్లను రాబట్టలేకపోయింది.

అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి మూవీలో ప్రదీప్‍కు జోడీగా దీపిక పిల్లి హీరోయిన్‍గా చేశారు. వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్ కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రదన్ సంగీతం అందించారు. ఈ సినిమాను మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ ప్రొడ్యూజ్ చేసింది. ఈ అర్ధరాత్రి (మే 8) నుంచి ఈ అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి మూవీని ఈటీవీ విన్ ఓటీటీలో వీక్షించొచ్చు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం