వర్ష, ఇమాన్యుయేల్ జోడీ చాలా కాలంగా జబర్ధస్థ్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కలిసి స్కిట్‌లు చేస్తున్నారు. ఈ జబర్ధస్థ్ షో ద్వారానే వీరిద్దరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. సుధీర్ - రష్మీ తర్వాత వర్ష, ఇమాన్యుయేల్ జోడీ జబర్ధస్థ్‌లో బాగా పాపులర్ అయ్యింది. స్కిట్‌లలో వీరిద్దరి కెమిస్ట్రీ, ఒకరితో మరికొరికి ఉన్న అనుబంధం కారణంగా వర్ష, ఇమాన్యుయేల్ ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి.
ఈ పుకార్లపై వర్షం, ఇమాన్యుయేల్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఔనని, కాదని చెప్పలేదు. వర్ష, ఇమాన్యుయేల్ మధ్య మనస్పర్థలు వచ్చినట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. గత ఏడాది తనకు, ఇమ్మూకు మధ్య చాలా గొడవలు జరిగాయని, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరం అన్‌ఫాలోతో పాటు బ్లాక్ చేసుకున్నామంటూ ఫ్యామిలీ స్టార్స్ షోలో వర్ష చెప్పింది.
వర్ష, ఇమాన్యుయేల్ ఇకపై కలిసి స్కిట్‌లు చేసే అవకాశం లేనట్లుగా కనిపిస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో వీరిద్దరు విడిపోనున్నట్లుగా హింట్ ఇచ్చేశారు. లేటెస్ట్ ప్రోమోలో ఇమాన్యుయేల్‌ను గుండెలకు హత్తుకొని వర్ష ఎమోషనల్ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకున్నది. ఈ ప్రోమోలో వర్ష, ఇమాన్యుయేల్ కలిసి తండేల్ సినిమాలోని బుజ్జితల్లి పాటకు డ్యాన్స్ చేశారు.
ఎమోషనల్‌గా వీరి డ్యాన్స్ సాగింది. స్కిట్ పూర్తవ్వగానే ఇమ్మూతో ఆల్‌మోస్ట్ ఇది చివరి పర్ఫార్మెన్స్ అనుకోవచ్చా అని వర్షను రష్మి అడిగింది. రష్మి మాటలతో వర్ష కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఇక్కడ ఎంత మంది ఉన్నా నువ్వు లేకపోతే బాగోదు అంటూ అతడిని కౌగిలించుకున్నది. బోరున ఏడ్చేసింది. వీరిద్దరు విడిపోనున్నది నిజమేనా? ఇదంతా స్కిట్‌లో భాగమా అన్నది మార్చి 23న టెలికాస్ట్ కానున్న ఫుల్ ఎపిసోడ్‌లో తేలనుంది.
వర్ష కొన్నాళ్లు టీవీ షోలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీదేవి డ్రామా కంపెనీనే ఆమె చివరి షో అని అంటున్నారు. అందుకే ఎమోషనల్ అయినట్లు చెబుతోన్నారు.
పాటలో వర్ష యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందని ప్రోమోను ఉద్దేశించి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు. వర్ష ఇమ్మూ కెమిస్ట్రీ కేక అంటూ పేర్కొన్నారు.
శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఎపిసోడ్‌కు హీరో సుమంత్ గెస్ట్‌గా రానున్నట్లు ప్రోమోలో చూపించారు. సుమంత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు అయిన సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ సుమంత్‌ను సత్కరించారు. తనను అక్కినేని నాగేశ్వరరావు దత్తత తీసుకున్నారని, ప్రాక్టికల్‌గా అయితే ఆయనే నాకు ఫాదర్ అని సుమంత్ చెప్పారు. ఈ ప్రోమోలో డీజే టిల్లు, మ్యాడ్ ఫేమ్ మురళీధర్ గౌడ్ కూడా ఓ స్కిట్ చేసినట్లు చూపించారు. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సంబంధిత కథనం