Jabardasth Comedian: హీరోగా జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ - మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితంతో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ!-jabardasth comedian auto ram prasad turns as hero wife of anirvesh movie first look unveiled ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jabardasth Comedian: హీరోగా జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ - మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితంతో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ!

Jabardasth Comedian: హీరోగా జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ - మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితంతో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ!

Nelki Naresh Kumar HT Telugu
Feb 01, 2025 06:27 PM IST

Jabardasth Comedian: జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ ఆటో రాం ప్ర‌సాద్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. వైఫ్ ఆఫ్ అనిర్వేష్ పేరుతో ఓ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోన్నాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి గంగ స‌ప్త శిఖర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్
జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్

Jabardasth Comedian: జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ రాం ప్ర‌సాద్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. వైఫ్ ఆఫ్ అనిర్వేష్ పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న వైఫ్ ఆఫ్ అనిర్వేష్ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆర్‌పీ ప‌ట్నాయ‌క్ రిలీజ్ చేశాడు. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో రామ్ ప్ర‌సాద్‌తో పాటు ప‌లువురు యాక్ట‌ర్లు క‌నిపిస్తోన్నారు. కేబుల్ బ్రిడ్జ్, హుస్సేన్ సాగ‌ర్‌తో పాటు హైద‌రాబాద్ సిటీ... పోస్ట‌ర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో క‌నిపిస్తోంది. ఓ జంట పార్టీ చేసుకుంటున్న‌ట్లుగా చూపించారు. పోస్ట‌ర్‌పై ఉన్న హి విల్ కిల్ యూ అనే ఆక్ష‌రాలు ఆస‌క్తిని పంచుతోన్నాయి.

yearly horoscope entry point

రామ్ ప్ర‌సాద్‌తో పాటు...

వైఫ్ ఆఫ్ అనిర్వేష్ మూవీకి గంగ స‌ప్త శిఖర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాంప్రసాద్‌తో పాటు జెమినీ సురేష్ , కిరీటి దామ‌రాజు , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. త్వరలో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

లింక్‌డ్ స్క్రీన్‌ప్లే..

ఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లే తో రూపొందిన W/O అనిర్వేష్ చిత్రం ఖ‌చ్చితంగా మంచి హిట్ సాధిస్తుంది. విభిన్న‌మైన క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది అని అన్నారు. లింక్‌డ్‌ స్క్రీన్ ప్లే అనే కొత్త ఎడిటింగ్ టెక్నిక్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్న‌మ‌ని, తెలుగు ప్రేక్ష‌కుల‌కు మంచి థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను ఈ మూవీ అందిస్తుంద‌ని నిర్మాత‌లు పేర్కొన్నారు.

మిమిక్రీ ఆర్టిస్ట్‌...

ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితం లో జరిగిన ఇబ్బందులని తనకు తెలిసిన కళతో ఎలా ఎదుర్కొన్నాడు? స‌మ‌స్య‌ల వ‌ల‌యం నుంచి ఏ విధంగా బ‌య‌ట‌ప‌డ్డాడు అనే కాన్సెప్ట్‌తో వైఫ్ ఆఫ్ అనిర్వేష్ మూవీ రూపొందుతోంది. ఎస్కెఎంఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఏపీ, తెలంగాణలో అతి త్వరలో రిలీజ్ రాబోతోంది.

టీమ్ లీడ‌ర్‌గా...

జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షోలో ప్ర‌స్తుతం టీమ్ లీడ‌ర్‌గా కొన‌సాగుతోన్నాడు రామ్ ప్ర‌సాద్‌. త్రీ మంకీస్‌, గంధ‌ర్వ‌, బెదురులంక‌, ఉమాప‌తితో పాటు ప‌లు తెలుగు సినిమాల్లో క‌మెడియ‌న్‌గా క‌నిపించాడు. ఇటీవ‌ల రిలీజైన దేవ‌కి నంద‌న వాసుదేవ సినిమాకు డైలాగ్ రైట‌ర్‌గా ప‌నిచేశాడు.

Whats_app_banner