Jabardast Ramprasad: జబర్ధస్థ్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. వైఫ్ ఆఫ్ అనిర్వేష్ పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ ట్రైలర్‌ను బిగ్‌బాస్ ఫేమ్, హీరో శివాజీ రిలీజ్ చేశాడు. బీచ్‌లో ఓ డెడ్‌బాడీ దొరికినట్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందే సీన్‌తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభమైంది. భర్త వల్ల సుఖం లేదని అతడిని తన ప్రియుడితో కలిసి చంపాలని ఓ భార్య ప్రయత్నించడం, ఓ హత్య కేసును పోలీసులు ఇన్వేస్టిగేషన్ చేసే అంశాలతో ఈ ట్రైలర్ సాగింది. ఈ మూవీలో జబర్ధస్థ్ రాంప్రసాద్ సీరియస్ రోల్‌లో కనిపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.
ట్రైలర్‌ను లాంఛ్ చేసిన అనంతరం శివాజీ మాట్లాడుతూ ట్రైలర్‌లో రాంప్రసాద్ క్యారెక్టర్ డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపిస్తుంది. కామెడీకి భిన్నంగా నటుడిగా అతడిని కొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా అవుతుందనే నమ్మకముంది. మార్చి 7న ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
దర్శకుడు గంగ సప్తశిఖర మాట్లాడుతూ కామెడీ బాగా చేస్తాడనే ఇమేజ్ ఉన్న జబర్దస్త్ రాంప్రసాద్‌తో క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేయడం చాలెంజింగ్ గా అనిపించింది. థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే ఆడియెన్స్‌ను ఈ మూవీ మెప్పిస్తుంది. యథార్థ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కించాం అని అన్నారు.
వైఫ్ ఆఫ్ అనిర్వేష్ మూవీలో జబర్ధస్థ్ రాంప్రసాద్‌తో పాటు జెమిని సురేష్, కిరీటి దామరాజు, సాయి ప్రసన్న, సాయికిరణ్, నాజియా ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి గంగా సప్తశిఖర దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేశ్వర్లు, మహేంద్ర గజేంద్ర, శ్యామ్ గజేంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
జబర్ధస్థ్ షోతో రాంప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ప్రస్తుతం బెదురులంక 2012, ఉమాపతి, లెహరాయి, గంధర్వ, పాగల్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో కమెడియన్‌గా కనిపించాడు. ఇటీవల రిలీజైన దేవకి నందన వాసుదేవ సినిమాకు డైలాగ్ రైటర్‌గా పనిచేశాడు.
సంబంధిత కథనం