Auto Ram Prasad Accident: జబర్దస్త్ ఫేమ్ ఆటో రామ్ ప్రసాద్‌కి యాక్సిడెంట్.. కారు ముందు భాగం నుజ్జు నుజ్జు
Ram Prasad Accident: సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనుతో కలిసి జబర్దస్త్‌లో పంచ్‌లు వేస్తూ ఆటో రామ్‌ప్రసాద్‌గా గుర్తింపు పొందిన కమెడియన్ రామ్‌ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతకి కారు ముందు భాగం బాగా దెబ్బతింది.
జబర్దస్త్ ఫేమ్ ఆటో రామ్‌ప్రసాద్‌కి గురువారం యాక్సిడెంట్ అయ్యింది. షూట్ నిమిత్తం కారులో రామ్‌ప్రసాద్ వెళ్తుండగా.. తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కారు సడన్‌గా బ్రేక్ వేయడంతో.. రామ్‌ప్రసాద్ కూడా కారుని సడన్‌గా ఆపాల్సి వచ్చింది. దాంతో వెనుక నుంచి అతని కారుని మరో వాహనం ఢీకొట్టడంతో.. రామ్‌ప్రసాద్ తన కారుతో ముందున్న కారుని ఢీకొట్టాడు. ఈ నేపథ్యంలో.. రామ్‌ప్రసాద్ కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది.
సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు
ఈ ప్రమాదంలో రామ్‌ప్రసాద్‌కి స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే.. అతని కారు బాగా డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. కారు ప్రమాదం తర్వాత రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు 108 అంబులెన్స్‌కి ఫోన్ చేయగా.. సిబ్బంది వచ్చి రామ్‌ప్రసాద్‌కి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనకి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరిది తప్పు? అనే కోణంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
సుధీర్, శ్రీను వెళ్లిపోయినా
ఈటీవీలో వస్తున్న జబర్దస్త్ కామెడీ షోతో వెలుగులోకి వచ్చిన రామ్‌ప్రసాద్.. తన పంచులతో ఆటో రామ్‌ప్రసాద్‌గా గుర్తింపు పొందాడు. రామ్‌ప్రసాద్‌తో కలిసి గతంలో స్కిట్ చేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ఇప్పటికే జబర్దస్త్‌ను వదిలేసి.. సినిమాలు చేసుకుంటున్నారు. కానీ.. రామ్‌ప్రసాద్ మాత్రమే అక్కడే ఉంటూ ఇప్పుడు టీమ్ లీడర్‌గా స్కిట్‌లు చేస్తున్నాడు.
సినిమాల్లో దొరకని ఛాన్స్‌లు
సుధీర్, శ్రీను తరహాలో రామ్‌ప్రసాద్ కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు. కానీ.. రెగ్యులర్‌గా అవకాశాలు మాత్రం రావడం లేదు. దాంతో జబర్దస్త్‌పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు. అయితే.. మునుపటితో పోలిస్తే ఇప్పుడు జబర్దస్త్‌లో కామెడీ వర్కవుట్ అవ్వడం లేదని ప్రేక్షకులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.
టాపిక్