Ram Puri Jagannadh Movie: పూరి జగన్నాథ్‌కు రామ్ మరో ఛాన్స్ ఇచ్చాడా? - ఇస్మార్ట్‌కు సీక్వెల్ రానుందా?
Ram Puri Jagannadh Movie: ఇస్మార్ట్ శంకర్ కాంబినేషన్ మరోసారి సెట్ అయినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలిసి ఓ సీక్వెల్ మూవీ చేయబోతున్నట్లు తెలిసింది.
Ram Puri Jagannadh Movie: ఇస్మార్ట్ శంకర్ తర్వాత మరోసారి మరోసారి హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో మూవీ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. 2019లో రిలీజైన ఇస్మార్ట్ శంకర్ మూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. రోటీన్ కథే అయినా రామ్ యాక్టింగ్, హీరోయిజం ప్రేక్షకుల్ని మెప్పించాయి. డబుల్ ఇస్మార్ట్ పేరుతో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్లు గత ఏడాది సెప్టెంబర్ లో పూరి జగన్నాథ్ ప్రకటించాడు.
తాజాగా ఈ సీక్వెల్‌ను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతోన్నట్లు సమాచారం. లైగర్ పరాజయంతో పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఏమిటన్నది చాలా రోజులుగా సస్పెన్స్‌గా మారింది. విజయ్ దేవరకొండతో జనగణమన అనౌన్స్‌చేసినా లైగర్ దెబ్బకు ఓపెనింగ్‌తోనే ఆ సినిమా ఆగిపోయింది.
దాంతో టాలీవుడ్ హీరోల చుట్టూ చక్కర్లు కొట్టిన పూరి జగన్నాథ్‌కు చివరకు రామ్ మరో ఛాన్స్ ఇచ్చినట్లు చెబుతోన్నారు. రామ్, పూరి జగన్నాథ్‌తో కాంబినేషన్‌లో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సీక్వెల్‌ను స్వయంగా పూరి జగన్నాథ్ నిర్మించబోతున్నట్లు సమాచారం.
త్వరలోనే ఈ కాంబినేషన్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ చేస్తోన్నాడు రామ్. పాన్ ఇండియన్ లెవెల్‌లో రూపొందుతోన్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కానుంది. ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.