కొన్ని నెలలుగా నటి సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇరువురూ ఈ వార్తను ధృవీకరించలేదు. అలాగే ఖండించలేదు కూడా. కానీ తరచుగా కలిసి కనిపిస్తున్నారు. ఇప్పుడిక సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలు ఈ డేటింగ్ రూమర్స్ ను మరింత పెంచాయి. రిలేషన్ షిప్ ను సమంత కన్ఫామ్ చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు.
ప్రొడ్యూసర్ గా సమంత తొలి అడుగు వేస్తున్నారు. ఆమె నిర్మించిన ‘శుభం’ మూవీ రేపే (మే 9) రిలీజ్ కాబోతోంది. ప్రోడ్యూసర్ గా సమంత ఇదే ఫస్ట్ ఫిల్మ్. ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో వరుసగా ఫొటోలు పోస్టు చేసింది. ఇందులో రాజ్ నిడిమోరు ఫొటోలు కూడా ఉన్నాయి. సమంత, రాజ్ సెల్ఫీ కూడా ఉంది.
'శుభం' మూవీ రిలీజ్ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సమంత ఫొటోలు పోస్టు చేసింది. "ఇది చాలా కష్టమైన ప్రయాణం. కానీ ఇక్కడివరకూ చేరుకున్నాం. కొత్త ఆరంభాలు. శుభం మే 9న విడుదలవుతుంది" అని తన పెంపుడు జంతువులు హాష్, శాషాతో దిగిన ఫోటోలు, సినిమా షూటింగ్ సమయంలోని క్షణాలు, ఇతర చిత్రాలను ఆమె పంచుకున్నారు.
సమంత, రాజ్ కలిసి సెల్ఫీ దిగిన ఫొటో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆమె కుక్క శాషా తన తలను రాజ్ భుజంపై ఉంచగా.. అతను పక్కకు చూస్తూ నవ్వుతున్న ఫొటో కూడా ఉంది.
రాజ్ తో సమంత దిగిన ఫొటోలపై ఫ్యాన్స్ రియాక్టవుతున్నారు. ఇదే కన్ఫర్మేషన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఓ అభిమాని అయితే సమంత లిఫ్ట్‌లో పుష్పగుచ్ఛాన్ని పట్టుకుని దిగిన చిత్రంలో రాజ్‌ను గుర్తించారు. "లిఫ్ట్ చిత్రంలో రాజ్ ఉన్నారు!!! ఓ మై గాడ్" అని కామెంట్ చేశారు. మరికొందరు అతనితో ఆమె ఎంత 'సంతోషంగా' ఉందో అంటూ వ్యాఖ్యానించారు.
‘రాజ్ అండ్ డీకే’గా ఫేమస్ అయిన డైరెక్టర్స్, ప్రోడ్యూసర్లలో ఒకరే ఈ రాజ్ నిడిమోరు. ఆయన స్వస్థలం తిరుపతి. రాజ్ అండ్ డీకే కలిసి చాలా సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. సినిమాలకు కథ అందించారు. తెలుగులో ‘డీ ఫర్ దోపిడీ’, ‘సినిమా బండి’ సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. ఫేమస్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’, ‘సిటాడెల్: హనీ బన్నీ’లకు వీళ్లే రైటర్స్, డైరెక్టర్స్, ప్రోడ్యూసర్స్.
సమంత్, రాజ్ కలిసి 'ది ఫ్యామిలీ మ్యాన్', 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌ల కోసం పనిచేశారు. ఆమె ఇప్పుడు అతనితో 'రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్'లో పనిచేస్తున్నారు. వారు చెన్నై సూపర్ ఛాంప్స్ అనే పికిల్‌బాల్ జట్టుకు కూడా భాగస్వాములు. నాగ చైతన్యతో 2021లో సమంత విడిపోయిన సంగతి తెలిసిందే. సమంత గత సంవత్సరం తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌ను ప్రారంభించారు.
సంబంధిత కథనం