Project K - Prabhas First Look: ప్రభాస్ ఫస్ట్ లుక్‍‍ను హడావుడిగా చేసేశారా!-is prabhas first look from project k is unplanned ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Project K - Prabhas First Look: ప్రభాస్ ఫస్ట్ లుక్‍‍ను హడావుడిగా చేసేశారా!

Project K - Prabhas First Look: ప్రభాస్ ఫస్ట్ లుక్‍‍ను హడావుడిగా చేసేశారా!

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 19, 2023 11:19 PM IST

Project K Prabhas First Look: ప్రాజెక్ట్ కే నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చింది. అయితే, దీనిపై చాలా మంది నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాజెక్ట్ కే నుంచి ప్రభాస్ లుక్
ప్రాజెక్ట్ కే నుంచి ప్రభాస్ లుక్

Project K Prabhas First Look: గ్లోబల్ మూవీ 'ప్రాజెక్ట్ కే’పై అంచనాలు భారీగా ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్‍కు సమయం సమీపిస్తోంది. కాగా, ఈ తరుణంలో నేడు (జూలై 19) ప్రాజెక్ట్ కే చిత్రం నుంచి హీరో ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ నేడు తీసుకొచ్చింది. అయితే, ప్రభాస్ ఫస్ట్ లుక్‍పై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. పేరడీలా ఉందని, దీని కన్నా ఫ్యాన్ మేడ్ బెస్ట్ అంటూ చాలా రకాలుగా కొందరు ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా ఈ ఫస్ట్ లుక్‍కు నెగిటివిటీ వచ్చింది. అయితే, ఇందుకు ప్రాజెక్ట్ కే చిత్ర యూనిట్ తొందరపాటే కారణంగా కనిపిస్తోంది.

yearly horoscope entry point

ప్రభాస్ ఫస్ట్ లుక్‍ను రిలీజ్ చేయాలని ప్రాజెక్ట్ కే టీమ్ ముందుగానే ప్లాన్ చేయలేదని సమాచారం. గ్లింప్స్ కంటే ముందు సర్‌ప్రైజ్‍ ఇద్దామనుకొని అప్పటికప్పుడు నిర్ణయించుకొని ఫస్ట్ లుక్‍ను డిజైన్ చేసిందట మూవీ యూనిట్. రెండు గంటల ముందుగా నిర్ణయించుకొని ప్రకటించినట్టు తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్‍ను నేటి (జూలై 19) మధ్యాహ్నం ఒంటి గంట 23 నిమిషాలకు రిలీజ్ చేస్తామని, మిల్లీ సెకన్లతో సహా ప్రకటించింది సినీ యూనిట్. అయితే, ఇది కూడా ఆలస్యమైంది. చివరికి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రభాస్ ఫస్ట్ లుక్‍ను రిలీజ్ చేసింది. ఈ ఆలస్యం కూడా అభిమానులకు చిరాకు తెప్పించింది.

మొత్తంగా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాక చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఐరన్ మ్యాన్ సూట్‍కు ప్రభాస్ తలను అతికించినట్టు ఈ ఫస్ట్ లుక్ ఉందని కొందరు కామెంట్లు చేశారు. ఈ లుక్ కన్నా ఫ్యాన్స్ తయారు చేసినవి బెటర్ అని మరికొందరు రాసుకొచ్చారు. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే సినిమాపై డౌటొస్తోందని మరికొందరు కామెంట్స్ చేశారు. అయితే, నాగ్ అశ్విన్ అండ్ టీమ్ హడావుడిగా ఈ ఫస్ట్ లుక్‍ను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. పెద్దగా కసరత్తు లేకుండానే త్వరత్వరగా తయారు చేసినట్టు సమాచారం. దీంతోనే ఈ ఫస్ట్ లుక్ అంత ఎఫెక్టివ్‍గా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, ఫస్ట్ లుక్‍ను ట్రోల్ చేస్తున్న వారికి కొందరు ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. ఫస్ట్ గ్లింప్స్ వరకు ఆగాలని సూచిస్తున్నారు. ఇది అప్పటికప్పుడు తయారు చేసిన ఫస్ట్ లుక్ అని, గ్లింప్స్ చూశాక మొత్తం పాజిటివ్‍గా మారుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. నాగ్ అశ్విన్ కచ్చితంగా అద్భుతం చేస్తాడని నమ్మకం పెట్టుకున్నారు.

కాగా, అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే సాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్‍లో ప్రాజెక్ట్ కే ఫ్లస్ట్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ జూలై 20 (భారత కాలమానం ప్రకారం జూలై 21)న రిలీజ్ చేయనుంది. ప్రాజెక్ట్ కే చిత్రంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, సీనియర్ హీరో కమల్‍హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‍తో వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Whats_app_banner