Prabhas: ఆ బాలీవుడ్ సినిమాలో ప్రభాస్ కామియో రోల్‍లో కనిపించున్నారా? దర్శకుడి వీడియోతో రూమర్లు
Prabhas - Singham Again: సింగం అగైన్ సినిమాలో ప్రభాస్ క్యామియో రోల్‍లో కనిపించనున్నారనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ దర్శకుడు రోహిత్ శెట్టి షేర్ చేసిన ఓ వీడియోతో ఇది మొదలయ్యాయి. ఆ వివరాలు ఇవే..
బాలీవుడ్‍లో సింగం సిరీస్ చిత్రాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఈ లైనప్‍లో తదుపరి ‘సింగం అగైన్’ చిత్రం రానుంది. అజయ్ దేవ్‍గణ్, అక్షయ్ కపూర్, కరీనా కపూర్ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ మూవీ దీపావళి సందర్భంగా రిలీజ్ కానుంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్రంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ క్యామియో రోల్ చేయనున్నారనే రూమర్లు బయటికి వచ్చాయి.
రోహిత్ శెట్టి వీడియోతో..
సింగం అగైన్ మూవీ దర్శకుడు రోహిత్ శెట్టి నేడు (సెప్టెంబర్ 30) ఇన్‍స్టాగ్రామ్‍లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ హీరో లేకుండా సింగం కంప్లీట్ కాదని, ఈ దీపావళికి స్కార్పియో వస్తుందంటూ ఓ వీడియో షేర్ చేశారు. అయితే, ఈ వీడియోకు ప్రభాస్ మూవీ కల్కి 2898 ఏడీలోని బుజ్జీ థీమ్‍ను బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍గా పెట్టారు రోహిత్ శెట్టి.
కల్కి మ్యూజిక్‍ను ఈ వీడియోకు వాడడం, ఈ హీరో లేకుండా సింగం అసంపూర్ణం అని, ఎవరో ఎంట్రీ ఇవ్వనున్నారని క్యాప్షన్ పెట్టడంతో ఈ చిత్రంలో ప్రభాస్ క్యామియో రోల్‍లో కనిపించనున్నారంటూ రూమర్లు వస్తున్నాయి. “ఈ హీరో లేకుండా సింగం కంప్లీట్ అవదు. ఈ దీపావళికి స్కార్పియో కచ్చితంగా వస్తుంది.. తిరుగుతుంది. అయితే, ఎంట్రీ వేరే వాళ్లది ఉంటుంది” అని రోహిత్ శెట్టి పోస్ట్ చేశారు.
రోహిత్ శెట్టి పోస్ట్ చేసిన ఈ వీడియోతో సింగం అగైన్‍లో ప్రభాస్ కనిపిస్తారనే రూమర్లు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఇది విపరీతంగా చక్కర్లు కొడుతోంది. మరి ఇది నిజమవుతుందా.. లేదా అనేది చూడాలి. ఒకవేళ ప్రభాస్ క్యామియో ఉంటే సింగం అగైన్ చిత్రానికి హైప్ భారీగా పెరుగుతుంది. హిందీలోనూ బాలీవుడ్ హీరోలకు మించిన క్రేజ్ ప్రభాస్‍కు ఉంది.
సింగం అగైన్ గురించి..
సింగం కాప్ యూనివర్స్‌లో ఐదో చిత్రంగా సింగం అగైన్ వస్తోంది. ఆగస్టు 15వ తేదీనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. షూటింగ్ ఆలస్యమటంతో దీపావళికి ఈ మూవీని తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
సింగం అగైన్ చిత్రంలో అజయ్ దేవ్‍గణ్, అక్షయ్, కరీనా, రణ్‍వీర్ సింగ్ కూడా క్యామియో రోల్స్‌లో కనిపించనున్నారు. దీపికా పదుకొణ్, టైగార్ ష్రాఫ్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్, దయానంద్ శెట్టి, శ్వేతా తివారీ ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు.