Game Changer OTT: గేమ్ ఛేంజర్ సినిమా ఓటీటీలో సక్సెస్ అవగలదా?-is it possible for game changer to find success on amazon prime video ott after a disappointing performance in theaters ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer Ott: గేమ్ ఛేంజర్ సినిమా ఓటీటీలో సక్సెస్ అవగలదా?

Game Changer OTT: గేమ్ ఛేంజర్ సినిమా ఓటీటీలో సక్సెస్ అవగలదా?

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 05, 2025 08:25 AM IST

Game Changer OTT: కమర్షియల్‍గా సక్సెస్ కాలేకపోయిన గేమ్ ఛేంజర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. భారీ బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ నెల తిరగకుండానే స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. మరి ఈ చిత్రం ఓటీటీలో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా..

Game Changer OTT: గేమ్ ఛేంజర్ సినిమా ఓటీటీలో సక్సెస్ అవగలదా?
Game Changer OTT: గేమ్ ఛేంజర్ సినిమా ఓటీటీలో సక్సెస్ అవగలదా?

మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం బోలెడు అంచనాలతో వచ్చి.. నిరాశకు గురైంది. సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది జనవరి 10న ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ రిలీజైంది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మొదటి నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్‍లపై తీవ్ర ప్రభావం పడింది. భారీ బడ్జెట్‍తో రూపొందిన గేమ్ ఛేంజర్‌కు బాక్సాఫీస్ వద్ద దెబ్బపడింది. ఈ మూవీ థియేటర్లలో రిలీజైన నెలలోపే ఓటీటీలో అడుగుపెడుతోంది. దీంతో స్ట్రీమింగ్ తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుందోననే ఆసక్తి రేగుతోంది.

yearly horoscope entry point

ఓటీటీలో సక్సెస్ అవుతుందా..

గేమ్ ఛేంజర్ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో మిశ్రమ స్పందనతో కమర్షియల్‍గా నిరాశపరిచిన ఈ చిత్రం.. ఓటీటీలో సక్సెస్ అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. గేమ్ ఛేంజర్ చిత్రానికి వచ్చిన నెగెటివ్ టాక్‍తో కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నా వాటిపై పెద్దగా బజ్ నడవలేదు.

రామ్‍చరణ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గేమ్ ఛేంజర్ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్. రామ్‍నందన్, అప్పన్న పాత్రల్లో చెర్రీ ఆకట్టుకున్నారు. వేరియేషన్స్ బాగా చూపించారు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో పర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. అయితే, ఈ పాత్ర నిడివి తక్కువగానే ఉండటంతో థియేటర్లలో రిలీజైనప్పుడు అంతగా చర్చ సాగలేదు. అయితే, ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చాక ఈ క్యారెక్టర్లో చెర్రీ యాక్టింగ్‍పై బజ్ బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓటీటీలో ఈ మూవీ సక్సెస్ అయ్యేందుకు ఈ అంశం బాగా తోడ్పడే ఛాన్స్ ఉంది.

ఈవారం టాప్ రిలీజ్

సంక్రాంతికి పోటీగా వచ్చిన డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు పాజిటివ్ టాక్ రావటంతో గేమ్ ఛేంజర్‌కు థియేటర్లలో మరింత ఎదురుదెబ్బ తగిలింది. అయితే, ఓటీటీలో మాత్రం ఈ వారం ఈ చిత్రమే టాప్ రిలీజ్‍గా ఉంది. దీంతో థియేటర్లలో చూడని వారు ఈ మూవీని ప్రైమ్ వీడియో ఓటీటీలో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించే ఛాన్స్‌లు మెండుగా ఉన్నాయి.

గేమ్ ఛేంజర్ చిత్రంలో కొన్ని సీన్లు బలంగా ఉంటాయి. అందుకే ఇప్పటికే చూసిన వారు కూడా మళ్లీ ఓటీటీలో ఓ లుక్కే అవకాశం ఉంటుంది. పాటల పిక్చరైజేషన్, గ్రాండ్‍నెస్, రామ్‍చరణ్ డ్యాన్స్ కూడా ఈ చిత్రానికి ప్లస్. ఇది కూడా ఓటీటీలో వ్యూస్‍ ఎక్కువగా వచ్చేందుకు మరో పాయింట్‍గా ఉండొచ్చు. థియేటర్లలో రిలీజైనప్పుడు గేమ్ ఛేంజర్ చిత్రంలో నెగెటివ్ పాయింట్లే ఎక్కువగా హైలైట్ అయ్యాయి. అయితే, అంచనాలు లేకుండా చాలా మంది ఓటీటీలో చూసే అవకాశం ఉండటంతో ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ రావొచ్చు.

శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 చిత్రానికి ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా ట్రోల్స్ వచ్చాయి. అయితే, ఆ మూవీతో పోలిస్తే గేమ్ ఛేంజర్ చాలా విషయాల్లో మెరుగ్గా ఉంటుంది. స్టోరీ పాయింట్ కూాడా ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే, కథనం విషయంలో తేడా కొట్టినా.. అక్కడక్కడా మెరుపు ఉంటాయి. మొత్తంగా థియేటర్లతో పోలిస్తే ఓటీటీలో గేమ్ ఛేంజర్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.

గేమ్ ఛేంజర్ మూవీలో రామ్‍చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా చేశారు. అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, జయరాం, సముద్రఖని కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేయగా.. థమన్ సంగీతం అందించారు. సుమారు రూ.350కోట్ల భారీ బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందింది. రూ.200లోపు కలెక్షన్లనే సాధించి నిరాశపరిచింది.

Whats_app_banner

సంబంధిత కథనం