అందంతో పాటు యాక్టింగ్ తోనూ అదరగొట్టే హాట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ రిలేషన్ షిప్ లో ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్ ను ఆమె డేటింగ్ చేస్తుందనే రూమర్స్ విపరీతంగా వస్తున్నాయి. అందుకు ఓ బలమైన కారణం ఉంది. ఇక అనుపమ, ధ్రువ్ కలిసి ప్రస్తుతం ‘బైసన్’ సినిమాలో నటిస్తున్నారు.
స్పాటిఫై మ్యూజిక్ యాప్ లో అనుపమ ముద్దు ఫొటో ఉందనే వార్త వైరల్ గా మారింది. అనుపమ పరమేశ్వరన్ అనే యూజర్ పేరుతో ఉన్న ‘బ్లూ మూన్’ ప్లే లిస్ట్ కు ఉన్న కవర్ ఫొటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫొటోలో అనుపమ, ధ్రువ్ విక్రమ్ ను లిప్ లాక్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఈ ఫొటో వాళ్లదే అనే కచ్చితమైన సమాచారం లేదు. దీన్ని హిందూస్థాన్ టైమ్స్ నిర్ధారించలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ స్క్రీన్ షాట్ తెగ వైరల్ గా మారింది.
స్పాటిఫైలో ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో అనుపమ, ధ్రువ్ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ ఊపందుకున్నాయి. అయితే దీనిపై అటు అనుపమ కానీ, ఇటు ధ్రువ్ కానీ రియాక్ట్ అవ్వలేదు. దీంతో ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. మరికొందరేమో దీన్ని పీఆర్ స్టంట్ గా పేర్కొంటున్నారు. ఎందుకంటే వీళ్లిద్దరూ కలిసి యాక్ట్ చేస్తున్న ‘బైసన్’ మూవీ ప్రమోషన్ కోసం ఇలా చేస్తున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు.
నిజంగానే అనుపమ, ధ్రువ్ విక్రమ్ ప్రేమలో ఉన్నారా? అనే దానిపై క్లారిటీ లేదు. కానీ రెడ్డిట్ లో మాత్రం కామెంట్ల వర్షం కురుస్తోంది. “ఓ మై గాడ్. అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ ప్రేమలో ఉన్నారా?” అని ఆ ప్లేలిస్ట్ స్క్రీన్‌గ్రాబ్‌ను పోస్ట్ చేసిన ఒక రెడ్డిటర్ రాశాడు. “ఇప్పుడు వారు ఈ ప్లేలిస్ట్‌ను తొలగించారు లేదా ప్రైవేట్ చేశారని నేను అనుకుంటున్నాను” అని ఆ ప్లేలిస్ట్ కోసం వెతికిన ఒక అభిమాని అన్నారు. మరొకరేమో “ప్లేలిస్ట్ ఇప్పుడు తొలగించబడింది… కాబట్టి అది నిజమే అని నేను అనుకుంటున్నా” అని రాసుకొచ్చాడు.
అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం దీన్ని పబ్లిసిటీ స్టంట్ గా కొట్టేస్తున్నారు. అనుపమ లేదా ధ్రువ్ లాంటి సెలబ్రిటీలు ఇలాంటి ఫొటోలతో ప్లే లిస్ట్ క్రియేట్ చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో వస్తున్న తమిళ్ సినిమా ‘బైసన్’లో అనుపమ, ధ్రువ్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కోసం ఈ స్టంట్లు చేస్తున్నారనే కౌంటర్లూ వస్తున్నాయి. ఈ మూవీని పా రంజిత్ నిర్మిస్తున్నారు.
తెలుగు, తమిళ్, మాలయళం భాషల్లో సినిమాలు చేస్తూ అనుపమ దూసుకెళ్తోంది. ఆమె చివరగా తెలుగు సినిమా ‘టిల్లు స్క్వేర్’లో కనిపించింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమాలో ఆమె బోల్డ్ లుక్స్ తో కవ్వించింది. ఈ కామెడీ థ్రిల్లర్ ఫ్యాన్స్ తో కేకలు పెట్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రముఖ హీరో విక్రమ్ కొడుకైనా ధ్రువ్ నెమ్మదిగా కెరీర్ నిర్మించుకుంటున్నాడు.
సంబంధిత కథనం