నాలుగేళ్లకు మరో ఓటీటీలోకి తెలుగులో వచ్చిన హారర్ థ్రిల్లర్- ఇవాళే స్ట్రీమింగ్- ముగ్గురు మలయాళ స్టార్స్ నటించిన మూవీ ఇది!-irul ott streaming on aha in telugu after netflix fahadh faasil soubin shahir darshana rajendran aparadhi ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నాలుగేళ్లకు మరో ఓటీటీలోకి తెలుగులో వచ్చిన హారర్ థ్రిల్లర్- ఇవాళే స్ట్రీమింగ్- ముగ్గురు మలయాళ స్టార్స్ నటించిన మూవీ ఇది!

నాలుగేళ్లకు మరో ఓటీటీలోకి తెలుగులో వచ్చిన హారర్ థ్రిల్లర్- ఇవాళే స్ట్రీమింగ్- ముగ్గురు మలయాళ స్టార్స్ నటించిన మూవీ ఇది!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ తెలుగులో మలయాళ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఇరుల్ స్ట్రీమింగ్‌గు వచ్చేసింది. మలయాళ స్టార్స్ అయిన ఫహాద్ ఫాజిల్, సౌబిన్ షాహిర్,దర్శన రాజేంద్రన్ నటించిన ఇరుల్ ఇవాళ తెలుగులో అపరాధి అనే టైటిల్‌తో ఓటీటీ రిలీజ్ అయింది. అపరాధి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నాలుగేళ్లకు మరో ఓటీటీలోకి తెలుగులో వచ్చిన హారర్ థ్రిల్లర్- ఇవాళే స్ట్రీమింగ్- ముగ్గురు మలయాళ స్టార్స్ నటించిన మూవీ ఇది!

మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ముఖ్యంగా ఓటీటీలో మలయాళ సినిమాలను అధిక సంఖ్యలో వీక్షిస్తుంటారు ఆడియెన్స్. అలాగే, వాటి కంటెంట్ కూడా చాలా డిఫరెంట్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఇక మలయాళంలో పుష్ప ఫేమ్ ఫహాద్ ఫాజిల్, మంజుమ్మెల్ బాయ్స్ యాక్టర్ సౌబిన్ షాహిర్, హృదయం హీరోయిన్ దర్శన రాజేంద్రన్ స్టార్స్‌గా పేరు తెచ్చుకున్నారు.

మలయాళ స్టార్స్ నటించిన

వీరిలో ఏ ఒక్కరి సినిమా అయిన దానికి మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి ఈ ముగ్గురు మలయాళ స్టార్స్ నటించిన సినిమా ఒకటి ఉంది. అదే ఇరుల్. మలయాళంలో హారర్ థ్రిల్లర్ మిస్టరీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు నసీఫ్ యూసుఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించారు. కేవలం గంటన్నర రన్‌టైమ్ మాత్రమే ఉన్న ఈ సినిమాను జోమోన్ టీ జాన్, ఆంటో జోసెఫ్, షామీర్ ముహమ్మద్ నిర్మించారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

అయితే, ఇదివరకే మలయాళంలో ఇరుల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళ భాషలో మాత్రమే ఇరుల్ ఓటీటీ రిలీజ్ అయింది. 2021లో తెరకెక్కిన ఇరుల్ ఇప్పుడు తెలుగులో డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అపరాధి అనే టైటిల్‌తో ఇరుల్ తెలుగు భాషలో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చేసింది.

అపరాధి టైటిల్‌తో

ఇవాళ (మే 8) ఆహాలో అపరాధి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అపరాధి ఓటీటీ రిలీజ్‌ను సోషల్ మీడియాలో ఆహా ప్లాట్‌ఫామ్ ప్రకటించింది. "ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ ఎక్స్ పీరియన్స్‌కి సిద్ధంగా ఉండండి. విమర్శకుల ప్రశంసలు పొందిన మలయాళ మిస్టరీ-హారర్ థ్రిల్లర్ ఇరుల్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం 'అపరాధి' అనే టైటిల్‌తో రాబోతోంది" అని రాసుకొచ్చింది ఆహా టీమ్.

నాలుగేళ్లకో మరో ఓటీటీలో

భవాని మీడియా ద్వారా ఆహాలో అపరాధి ఓటీటీ ప్రీమియర్ కానుంది. అద్భుతమైన నటనలతో, ఉత్కంఠభరిత కథనంతో అపరాధి ఆహా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుందని ఓటీటీ ప్లాట్‌ఫామ్ తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ తర్వాత నాలుగేళ్లకు మరో ఓటీటీ అయిన ఆహాలోకి తెలుగులో వచ్చిన ఇరుల్ సినిమా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 5.8 రేటింగ్ సొంతం చేసుకుంది.

అపరాధి కథ

ఇకపోతే ఇరుల్ అంటే తెలుగులో చీకటి అనే అర్థం వస్తుంది. కానీ, ఈ మూవీని తెలుగులో అపరాధి టైటిల్‌తో ఓటీటీ రిలీజ్ చేయడం గమనార్హం. ఇక అపరాధి మూవీ కథలోకి వెళ్తే.. అలెక్స్ ఒక బిజినెస్ మ్యాన్ అయిన పుస్తకరచయిత. తన లవర్ అర్చనతో కలిసి వీకెండ్ ఓ టూర్ ప్లాన్ చేస్తాడు. అది కూడా సెల్‌ఫోన్స్ లేకుండా.

ఆహా ఓటీటీలో

వీకెండ్ ట్రిప్‌కు వెళ్తున్న మార్గమధ్యలో కారు బ్రేక్ డౌన్ అవుతుంది. వర్షం పడటంతో పక్కన ఉన్న ఓ బిల్డింగ్‌లోకి వెళ్తారు. ఆ ఇంట్లో టెలీఫోన్స్ ఏవి పనిచేయవని ఇంటి ఓనర్ చెబుతాడు. తర్వాత అలెక్స్ రాసిన క్రైమ్ థ్రిల్లర్ బుక్ ఇరుల్‌పై సెటైరికల్ కామెంట్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో ఏం జరిగిందనేదే అపరాధి కథ. మరి ఫహాద్, సౌబిన్, దర్శన వంటి ముగ్గురు మలయాళ స్టార్స్ నటించిన అపరాధి మూవీని ఆహా ఓటీటీలో తెలుగులో ఎంచక్కా వీక్షించండి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం