Best Malayalam Movies In OTT: ఓటీటీలో రిలీజైన‌ బెస్ట్ మ‌ల‌యాళ థ్రిల్ల‌ర్ మూవీస్ ఇవే - వీటిపై ఓ లుక్కేయండి-iratta to mukundan unni associates best malayalam thriller movies released in ott recent times
Telugu News  /  Entertainment  /  Iratta To Mukundan Unni Associates Best Malayalam Thriller Movies Released In Ott Recent Times
ఇరాట్టా
ఇరాట్టా

Best Malayalam Movies In OTT: ఓటీటీలో రిలీజైన‌ బెస్ట్ మ‌ల‌యాళ థ్రిల్ల‌ర్ మూవీస్ ఇవే - వీటిపై ఓ లుక్కేయండి

17 March 2023, 10:13 ISTNelki Naresh Kumar
17 March 2023, 10:13 IST

Best Malayalam Movies In OTT: ఇటీవ‌ల కాలంలో ఓటీటీలో రిలీజైన కొన్ని మ‌ల‌యాళ క్రైమ్‌ థ్రిల్ల‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్నాయి. ఆ సినిమాలు ఏవంటే...

Best Malayalam Movies In OTT: మ‌ల‌యాళంలో క‌మ‌ర్షియ‌ల్‌ విలువ‌ల కంటే క‌థ‌ల‌కు ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాల్ని తెర‌కెక్కిస్తుంటారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వ‌చ్చిన త‌ర్వాత మ‌ల‌యాళ సినిమాల రీచ్ మ‌రింత పెరిగింది. అన్ని భాష‌ల ప్రేక్ష‌కులు మ‌ల‌యాళ‌ సినిమాల్నిచూస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాల‌తో రూపొందిన కొన్ని మ‌ల‌యాళ క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాలు ఓటీటీలో సెన్సేష‌న్‌ను క్రియేట్ చేశాయి. ప్రేక్ష‌కుల్ని మెప్పించిన ఆ సినిమాలు ఏవంటే...

ఇరాట్టా (నెట్‌ఫ్లిక్స్‌)

జోజుజార్జ్ (Joju George) డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఒకే పోలిక‌ల‌తో ఉన్న ఇద్ద‌రు పోలీస్ ఆఫీస‌ర్స్‌లో ఒక‌రు అనుకోకుండా స్టేష‌న్‌లోనే చ‌నిపోతాడు. అత‌డిది హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా అన్న‌ది సోద‌రుడు ఎలా క‌నిపెట్టాడు? ఆ పోలీస్ ఆఫీస‌ర్ మ‌ర‌ణం వెనుక ఉన్న క‌థేమిట‌న్న‌దే ఇరాట్టా సినిమా ఇతివృత్తం. మాన‌వ సంబంధాల నేప‌థ్యంలో షాకింగ్ క్లైమాక్స్‌తో ఈ సినిమా ఎండ్ అవుతుంది.

తాంకం (అమెజాన్ ప్రైమ్‌)

వినీత్ శ్రీనివాస‌న్‌, బిజుమీన‌న్, అప‌ర్ణా బాల‌ముర‌ళీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తాంకం సినిమా అమెజాన్ ప్రైమ్‌లో (Amazon prime) రిలీజైంది. గోల్డ్ ఏజెంట్స్ జీవితాల నేప‌థ్యంలో క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ఊహించ‌ని మ‌లుపుల‌తో ఈ సినిమా సాగుతుంది.

ముకుంద‌న్ ఉన్ని అసోసియేట్స్ ( డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌)

వినీత్ శ్రీనివాస‌న్ హీరోగా న‌టించిన ముకుంద‌న్ ఉన్ని అసోసియేట్స్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. జీవితంలో ఎద‌గ‌డానికి అడ్డ‌దారులు తొక్కిన ఓ లాయ‌ర్ క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింది.

రోషాక్‌(డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌)

మ‌మ్ముట్టి (Mammootty)హీరోగా న‌టించిన రోషాక్ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజైంది. త‌న భార్య మ‌ర‌ణానికి కార‌ణ‌మైన ఓ వ్య‌క్తిపై ప్ర‌తీకారం తీర్చుకునే ఎన్ఆర్ఐ క థ ఇది.

వీటితో పాటు పృథ్వీరాజ్ జ‌న‌గ‌న‌మ‌ణ (నెట్‌ఫ్లిక్స్‌) ప‌డా (అమెజాన్ ప్రైమ్‌), కోమ‌న్ (అమెజాన్ ప్రైమ్‌) ది టీచ‌ర్ (నెట్‌ఫ్లిక్స్‌) సినిమాలు ప్రేక్ష‌కుల‌కు థ్రిల్లింగ్‌ను పంచుతాయి.