ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. హారర్, కామెడీ, బోల్డ్ జోనర్స్‌పై ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండే సినిమాలకు కూడా అట్రాక్ట్ అవుతుంటారు. ఎలాంటి జోనర్‌కు అయిన థ్రిల్లింగ్ సీన్స్, అదిరిపోయే ట్విస్టులు యాడ్ చేసి తెరకెక్కిస్తే అవి మంచి హిట్ అందుకుంటాయి.
అయితే, కొన్నిసార్లు అవి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా మిగిలి ఓటీటీ రిలీజ్ తర్వాత మాత్రం మంచి హైప్ తెచ్చుకుంటాయి. అలాంటి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా గురించే ఇక్కడ చెప్పుకునేది. ఈ సినిమా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మూవీలోని సీన్స్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. మరి ఆ సినిమాను ఓటీటీ సజెషన్ కింద లుక్కేయండి.
ఇంతకీ ఆ మూవీ పేరు గాడ్. తమిళంలో తెరకెక్కిన ఇరైవన్ సినిమాను తెలుగులో గాడ్ అనే టైటిల్‌తో రిలీజ్ చేశారు. తమిళ స్టార్ హీరో జయం రవి, లేడి సూపర్ స్టార్ నయనతార జంటగా నటించారు. బాలీవుడ్ యాక్టర్ రాహుల్ బోస్ విలన్‌గా మెప్పించాడు. ఇరైవన్ సినిమాకు ఐ అహ్మద్ దర్శకత్వం వహించారు.
గాడ్ కథలోకి వెళితే.. ఏసీపీ అర్జున్ (జయం రవి) ఎలాంటి కేస్‌ను అయిన సాల్వ్ చేసే మొండితనం ఉన్న పోలీస్ ఆఫీసర్. క్రిమినల్‌ను శిక్షించడానికి అవసరమైతే చట్టాన్ని అతిక్రమించడంలో తప్పులేదనే నమ్మే వ్యక్తి. కోపం ఎక్కువ.
మరోవైపు సిటీలో చాలా మంది అమ్మాయిల అవయవాలు (బాడీ పార్ట్స్) తీసేసి చంపి నగ్నంగా బయటపడేస్తుంటాడు బ్రహ్మ అలియాస్ స్మైలీ కిల్లర్ (రాహుల్ బోస్). బ్రహ్మను పట్టుకునేందుకు అర్జున్, అతని ఫ్రెండ్ ఆండ్రూ (నరేన్) రంగంలోకి దిగుతారు. బ్రహ్మను పట్టుకునే క్రమంలో ఆండ్రూ చనిపోతాడు.
ఆండ్రూ కుటుంబ బాధ్యతలను అర్జున్ తీసుకుంటాడు. ఆండ్రూ చెల్లెలు ప్రియ (నయనతార)తో కలిసి కాఫీ షాప్ ఓపెన్ చేస్తాడు. కానీ జైలు నుంచి తప్పించుకున్న బ్రహ్మ మళ్లీ హత్యలు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? బ్రహ్మను అర్జున్ ఎలా పట్టుకున్నాడు? అసలు హత్యలు చేసేది ఎవరు? అనే అదిరిపోయే ట్విస్టులతో సాగే సినిమానే గాడ్.
ఇలా థ్రిల్లింగ్ ట్విస్టులతో సాగే గాడ్ ఓటీటీలో అదరగొట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో గాడ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇరైవన్ టైటిల్‌తో తమిళంలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళంలో రెండు టైటిల్స్‌తో ఇరైవన్ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.
సంబంధిత కథనం