Jr NTR: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్‌కు అందని ఆహ్వానం!-invitation not sent to jr jtr for chandrababu naidu oath taking ceremony ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్‌కు అందని ఆహ్వానం!

Jr NTR: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్‌కు అందని ఆహ్వానం!

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 11, 2024 10:42 PM IST

Jr NTR: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి జూనియన్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం విషయంలో రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే, ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది.

Jr NTR: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్‌కు అందని ఆహ్వానం!
Jr NTR: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్‌కు అందని ఆహ్వానం!

Jr NTR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు (జూన్ 12) గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ఉండనుంది. ఈ కార్యక్రమం కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందలేదని సమాచారం బయటికి వచ్చింది. అయితే, ఈ విషయంపై కొన్ని పుకార్లు కూడా చక్కర్లు కొట్టాయి. ఆ వివరాలివే..

రూమర్లు ఇలా..

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందిందని, అయితే దేవర షూటింగ్‍లో బిజీగా ఉన్న ఆయన హాజరు కావడం లేదంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో రూమర్లు వచ్చాయి. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందలేదని సమాచారం బయటికి వచ్చింది.

ఆహ్వానం విషయంలో గందరగోళం నెలకొనడటంతో జూనియన్ ఎన్టీఆర్ టీమ్ స్పందించిందని సమాచారం బయటికి వచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందలేదని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తన మామయ్య చంద్రబాబు నాయుడు, బాబాయ్ బాలకృష్ణకు అభినందనలు తెలుపుతూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. “ప్రియమైన చంద్రబాబు మావయ్యకు ఈ చరిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ బాబాయ్‍కి, నారా లోకేశ్‍కు కూడా శుభాకాంక్షలు చెప్పారు.

అయితే, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్టీఆర్‌కు ఆహ్వానం ఎందుకు పంపలేదో కారణాలు వెల్లడి కాలేదు. తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు ఎన్టీఆర్ దూరంగా ఉంటుండమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్‍లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం గోవా పరిసరాల్లో జరుగుతోంది. అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. అయితే, సెప్టెంబర్ 27వ తేదీకే వస్తుందనే రూమర్లు కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, అజయ్ కీరోల్స్ చేస్తున్నారు. దేవరకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

విశిష్ట అతిథిగా చిరంజీవి

చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర విశిష్ట అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేటి సాయంత్రమే ఆయన విజయవాడకు వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

విజయవాడ చేరిన రజినీ

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన నేడే విజయవాడ చేరుకున్నారు.

రేపు (జూన్ 12) ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సినీ, వ్యాపార సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

Whats_app_banner