Kasthuri Shankar: గంటకు 5 వేలు.. గృహలక్ష్మి కస్తూరిపై కామెంట్.. ఆ ఇంట్రెస్ట్ లేదంటూ!-intinti gruhalakshmi actress kasthuri shankar trolled for comments on bigg boss show tamil ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kasthuri Shankar: గంటకు 5 వేలు.. గృహలక్ష్మి కస్తూరిపై కామెంట్.. ఆ ఇంట్రెస్ట్ లేదంటూ!

Kasthuri Shankar: గంటకు 5 వేలు.. గృహలక్ష్మి కస్తూరిపై కామెంట్.. ఆ ఇంట్రెస్ట్ లేదంటూ!

Sanjiv Kumar HT Telugu

Netizen On Kasthuri Shankar: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా పాపులర్ అయిన కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్‌కి నెటిజన్ ఊహించని విధంగా కామెంట్ చేశాడు.

గంటకు 5 వేలు.. గృహలక్ష్మి కస్తూరిపై కామెంట్.. ఆ ఇంట్రెస్ట్ లేదంటూ! (Instagram)

అప్పట్లో హాట్ హీరోయిన్‌గా అనేక సినిమాలతో పేరు తెచ్చుకుంది కస్తూరి శంకర్. తమిళ చిత్రాల్లో స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించుకున్న కస్తూరి శంకర్ తెలుగులో అన్నమయ్య సినిమాతో పాగా పాపులర్ అయింది. ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్, ఓటీటీ సిరీసులు, సీరియల్స్ తో బిజీగా ఉంది కస్తూరి శంకర్. ముఖ్యంగా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌లో తులసి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.

ఇదిలా ఉంటే ఇటీవల తమిళ బిగ్ బాస్ ఏడో సీజన్ (Bigg Boss Tamil) ప్రారంభమైంది. అందులోకి తమిళ పాపులర్ నటి వనిత విజయ్ కుమార్ కూతురు జోవిక విజయ్ కుమార్ (Jovika vijaykumar) ఎంట్రీ ఇచ్చింది. ఇదివరకు తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో వనిత విజయ్ కుమార్‌తోపాటు కస్తూరి శంకర్ కూడా పాల్గొంది. అయితే, జోవిక బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంపై కస్తూరి శంకర్ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా అడిగనట్లున్నారు.

"లేదు, ఒక ఇంట్లో చాలా మందిని ఉంచి వారి ఆర్టిఫిషియల్ ఫీలింగ్స్ చూపే షోను నేను పట్టించుకోను. నా దగ్గర టీవీ లేదు. నాకంతా టైమ్, ఓపిక, ఇంట్రెస్ట్ లేవు. నాకు కుటుంబం, దాని బాధ్యతలు, వర్క్ ఉన్నాయి. నేను బిగ్ బాస్ చూడటం లేదు" అని కస్తూరి శంకర్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‍ను సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

"బిగ్ బాస్ షోలోకి వెళ్లిన నువ్వు.. ఇప్పుడు ఇలా అంటున్నావా?", "డబ్బుల కోసం షోకి వెళ్లావ్ కదా. మళ్లీ ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావ్?" అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఒక నెటిజన్ అయితే దారుణంగా కామెంట్ చేశాడు. "అవునులే, నీకు గంటకు రూ. ఐదు వేలు వస్తాయ్ కదా" అని అన్నాడు. దానికి "మీ ఇంట్లో వాళ్లు నిన్ను ఇలానే పెంచారా? నిన్ను చూస్తుంటే సిగ్గేస్తోంది" అని కస్తూరి శంకర్ సీరియస్ అయింది.