Intimate Scene: ఇంటిమేట్ సీన్‌లో 20 ఏళ్ల హీరోయిన్ పెదవి కొరికిన 42 ఏళ్ల హీరో.. కంట్రోల్ చేసుకోలేక.. రచ్చ రచ్చ కావడంతో..
Intimate Scene: హీరో, హీరోయిన్లు ఇంటిమేట్ సీన్ చేసే సమయంలో ఎవరైనా అదుపు తప్పితే ఎలా ఉంటుంది? నిజానికి ఇలాంటివి అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇలాగే ఓ హీరో అలాంటి సీన్ చేసే వేళ కంట్రోల్ చేసుకోలేక హీరోయిన పెదవిని గట్టిగా కొరికేశాడట.
Intimate Scene: సినిమాల్లో ఇంటిమేట్ సీన్లు చేయడం అంత సులువు కాదు. హీరో, హీరోయిన్లు సెట్లో అందరి ముందు ఘాటు రొమాన్స్ చేయడమే కాదు.. ఆ సమయంలో తమను తాము నియంత్రణలోనూ ఉంచుకోవాల్సి వస్తుంది. కానీ ఓ 42 ఏళ్ల హీరో మాత్రం షూటింగ్ అని మరచిపోయి సీన్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి 20 ఏళ్ల వయసున్న హీరోయిన్ పెదవిని గట్టిగా కొరికేశాడట.
ఇంటిమేట్ సీన్‌లో అదుపు తప్పి..
ఈ మధ్య టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా లిప్ లాక్‌లు, హాట్ సీన్లు కామనైపోయాయి. కానీ 36 ఏళ్ల కిందట హిందీలో వచ్చిన ఓ సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య ఘాటు రొమాన్స్ సీన్ ఒకటి అప్పట్లో రచ్చ రచ్చ చేసింది. ఆ సినిమా పేరు దయావన్. ఇందులో వినోద్ ఖన్నా, మాధురి దీక్షిత్ హీరోహీరోయిన్లుగా నటించారు.
అప్పటికి వినోద్ ఖన్నా వయసు 42 ఏళ్లు కాగా.. అప్పుడప్పుడే బాలీవుడ్ లో పేరు కోసం చూస్తున్న మాధురి దీక్షిత్ వయసు 20 ఏళ్లు మాత్రమే. ఈ సినిమాలో ఆజ్ ఫిర్ తుమ్‌సే అనే ఓ పాట షూటింగ్ లో ఇద్దరి మధ్య ఓ ఘాటు రొమాన్స్ సీన్ చేయాల్సి వచ్చింది.
అందులో హీరో, హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్ ఉంటుంది. ఆ సీన్ షూట్ చేసే సమయంలో వినోద్ ఖన్నా కంట్రోల్ చేసుకోలేక హీరోయిన్ మాధురి దీక్షిత్ పెదవిని గట్టిగా కొరికేశాడట. సీన్ ముగిసిందని చెప్పినా అతడు వినకుండా అలాగే కంటిన్యూ చేసినట్లు అప్పట్లో సెట్‌లో ఉన్న వాళ్లు చెప్పేవారు.
రచ్చ రచ్చ కావడంతో..
అప్పటికే వినోద్ ఖన్నా బాలీవుడ్ లో పేరు సంపాదించిన హీరో. కానీ మాధురి దీక్షిత్ మాత్రం ఈ ఊహించని పరిణామంతో షాక్ తిన్నది. అతడు గట్టిగా కొరకడంతో ఆమె పెదవి కట్ అయి రక్తం కారిపోయింది. అది తట్టుకోలేక ఆమె ఏడుస్తూ ఉండిపోయింది.
తర్వాత షూటింగ్ కు కూడా ఆమె సంకోచించడంతో డైరెక్టర్ ఫిరోజ్ ఖాన్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అతనితోపాటు వినోద్ ఖన్నా కూడా మాధురికి క్షమాపణ చెప్పారు. దీంతో మళ్లీ ఆమె షూటింగ్ చేయడానికి అంగీకరించింది. అయితే ఈ ఘటన మాత్రం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి మరో సినిమాలో నటించలేదు.
నాయకుడు రీమేకే..
ఈ దయావన్ మూవీ తమిళం, తెలుగులో సూపర్ హిట్ అయిన నాయకుడు మూవీకి రీమేకే కావడం విశేషం. 1987లో రిలీజైన నాయకుడు మూవీలో కమల్ హాసన్ నటించగా.. మణిరత్నం డైరెక్ట్ చేశాడు. ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాలో అత్యుత్తమ మూవీస్ లో ఒకటిగా పేరుగాంచింది.
అలాంటి నాయకుడు సినిమాను హిందీలో వినోద్ ఖన్నా, మాధురి దీక్షిత్ తో దయావన్ పేరుతో తెరకెక్కించారు. అయితే తెలుగు, తమిళంలో సాధించినంత సక్సెస్ హిందీలో రాలేకపోయింది. కానీ తర్వాత రోజుల్లో మాధురి మాత్రం బాలీవుడ్ ను ఏలింది. టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.