Aishwarya Lekshmi : షాప్‌లోని పేపర్ నన్ను హీరోయిన్‌ను చేసింది
Aishwarya Lekshmi Movies : ఓ షాప్‌లోని పేపర్ తనను హీరోయిన్ చేసిందని నటి ఐశ్వర్య లక్ష్మి చెప్పుకొచ్చింది. డాక్టర్‌ను కాబోయి.. అనుకోకుండా యాక్టర్ అయ్యానని తెలిపింది.
Interview With Actress Aishwarya Lekshmi నటి ఐశ్వర్య లక్ష్మి గుర్తుందా? గ్లామర్ హంగుల కంటే అభినయాన్ని నమ్ముకొని సినీ పరిశ్రమలో రాణించే హీరోయిన్లు అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో ఐశ్వర్యలక్ష్మి(Aishwarya Lekshmi) ఒకరు. తమిళంలో డిఫరెంట్ క్యారెక్టలర్స్ తో హీరోయిన్‌గా మంచి పేరుతెచ్చుకున్నది ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lekshmi). సత్యదేవ్ నటించిన గాడ్సే(Godse) మూవీలో హీరోయిన్ గా చేసింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన.. అమ్ము(Ammu) సినిమాలోనూ కనిపించింది. ఈ సినిమాలో నవీన్‌చంద్ర హీరో. ఈ డ్రీమ్ గర్ల్.. డాక్టర్ నుంచి నటిగా ఎలా మారింది? తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది..
'నేను తిరువనంతపురం అమ్మాయిని. పుట్టిన తర్వాత తండ్రి శ్రీలక్ష్మి అని, తల్లి ఐశ్వర్య అని పేరు పెట్టారు. చివరికి ఐశ్వర్య లక్ష్మి అయ్యాను. ఎంబీబీఎస్(MBBS) చదవడానికి కొచ్చి వెళ్లాను. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను. అనుకోకుండా నటిని అయ్యాను. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రిజల్ట్ రావడానికి రెండు రోజుల ముందు కొచ్చిలోని కేఫ్ లు అన్నీంటికి వెళ్లాను. నా స్నేహితులతో కలిసి ప్రతి షాప్ కి వెళ్లాను.
ఓ షాప్‌లో నివిన్ పౌలీ.. హీరోయిన్ కోసం ఓ పేపర్‌లో ప్రకటన వచ్చింది. అది చూసిన తర్వాత, నేను నా ఫోటోను ఆ చిరునామాకు పంపాను. ఆ దర్శకుడు నా స్నేహితుడి.. స్నేహితుడు. ఓ మిత్రుడి ద్వారా దర్శకుడితో ఫోన్‌లో కూడా మాట్లాడాను.
నేను మరుసటి రోజు క్రిస్మస్ సందర్భంగా కలుసుకున్నాను. ఆ రోజే సెలెక్ట్ అయ్యాను. ఈ విషయంపై మా అమ్మ చాలా కఠినంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే నేను సినిమాల్లోకి రావడం మా అమ్మకు ఇష్టం లేదు. ఇప్పుడు కాస్త సెట్ అయింది. ప్రస్తుతం నాకు ఎంబీబీఎస్ కంటే యాక్టింగ్ అంటే ఇష్టం.
నా మొదటి క్రష్ క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvaraj Singh). ఆయనంటే నాకు చాలా ఇష్టం. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు యువరాజ్ సింగ్‌పై ప్రేమ ఉంది. ఆ తర్వాత క్రికెట్ చూసే సమయం లేదు. సినిమా విషయానికొస్తే, నాకు అభిషేక్ బచ్చన్, విజయ్ దళపతి మీద ప్రేమ. నాపై ఇంత అభిమానాన్ని, ప్రేమను అందిస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలు. మీ సపోర్ట్‌తో నాకు మంచి పాత్రలు వస్తాయని ఆశిస్తున్నాను.' అని ఆ ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మి చెప్పింది.