Chaurya Paatam: ఈగల్ డైరెక్టర్ కథతో చౌర్య పాఠం - హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిరంజీవి అభిమాని ఇంద్రరామ్
Chaurya Paatam: చౌర్య పాఠం మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు ఇంద్రరామ్. ఈ క్రైమ్ కామెడీ మూవీకి ఈగల్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని కథను అందిస్తోన్నాడు. మరో టాలీవుడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్నాడు.

Chaurya Paatam: ఈగల్ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని కథను అందిస్తోన్న చౌర్య పాఠం మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు ఇంద్రరామ్. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్నాడు.
చౌర్య పాఠం టీజర్‌ను ఇటీవలే విలక్షణ నటుడు విజయ్ సేతుపతి రిలీజ్ చేశాడు.డిఫరెంట్ పాయింట్‌తో ఈ టీజర్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చౌర్య పాఠం మూవీ త్వరలో తెలుగు ప్రేక్షకలు ముందుకు రాబోతోంది. చౌర్య పాఠం మూవీ గురించి ఇంద్రరామ్ పలు చెప్పిన సంగతులివి...
రిజెక్షన్స్ ఎదుర్కొన్నా…
చౌర్య పాఠం కోసం రెండేళ్లు కష్టపడ్డట్లు హీరో ఇంద్రరామ్ అన్నాడు. యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు పేర్కొన్నాడు. హీరోగా ఇదే తన తొలి సినిమా అని ఇంద్రరామ్ చెప్పాడు. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత నటనపై ఆసక్తితో ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగా. కొన్ని అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయి. మరికొన్ని సినిమాలు కథలు నచ్చక నేను వదులుకున్నా. ఈ ప్రయాణంలో కొన్ని రిజెక్షన్స్ కూడా చూశాను. చౌర్య పాఠం మూవీ గురించి తెలిసి ఆడిషన్స్‌కు అటెండ్ అయ్యా. త్రినాథరావు నక్కిన, కార్తిక్ ఘట్టమేనని నన్ను ఆడిషన్ చేసి ఈ సినిమాలో హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు
కథే హీరో…
చౌర్య పాఠం సినిమాలో నాతో పాటు ప్రతి పాత్రకు సమానంగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమాకు కథే హీరో. దొంగతనం చేయడానికి హీరో అండ్ టీమ్ వేసే ప్లాన్‌లు, వారికి ఎదురయ్యే ఇబ్బందులు ఆద్యంతం వినోదాన్ని పంచుతాయి. కొత్తదనం కోరుకునే ఆడియెన్స్ అందరిని ఈ మూవీ మెప్పిస్తుంది.
విజయ్ సేతుపతి ప్రశంసలు…
చౌర్య పాఠం టీజర్ రిలీజ్ చేయడానికి విజయ్ సేతుపతి మొదట ఐదు నిమిషాలు మాత్రమే మాకు టైమ్ ఇచ్చారు. టీజర్ చూసి ఆయన ఇంప్రెస్ అయ్యారు. కాన్సెప్ట్ గురించి తెలుసుకొని మాతో నలభై నిమిషాలకుపైగా మాట్లాడారు. టీజర్ విజయ్ సేతుపతి లాంటి గొప్ప యాక్టర్‌ను మెప్పించడమే మేము మొదటి సక్సెస్‌గా భావిస్తున్నాం.
చిరు అభిమానిని…
చిరంజీవి, రవితేజ నా అభిమాన నటులు. వారి యాక్టింగ్‌ను ఎంజాయ్ చేస్తుంటా. యంగ్ జనరేషన్‌లో విజయ్ దేవరకొండ నటనను ఇష్టపడుతుంటా. పాత్రల పరంగా విజయ్ సేతుపతి చూపించే వెర్సటాలిటీ నచ్చుతుంది. వారిలా చిరకాలం గుర్తుండిపోయే పాత్రలు చేయాలనుంది.
పెద్ద బ్యానర్ లో నెక్స్ట్ మూవీ
చౌర్య పాఠం రిలీజ్ డేట్‌ను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నాం. ఈ సినిమా విడుదల కాకముందే టాలీవుడ్‌లో పలు అవకాశాలు వచ్చాయి. పెద్ద ప్రొడక్షన్ హౌజ్‌లో నెక్స్ట్ మూవీ చేయబోతున్నా. ఆ సినిమా పూర్తి వివరాల్ని త్వరలో వెల్లడిస్తాను. యూత్ ఆడియెన్స్‌ను మెప్పించేలా నా క్యారెక్టర్ ఉండబోతుంది.
టాపిక్