Anupamaa Serial: ఇండియాలోనే నంబర్ వన్ టీవీ సీరియల్ నటి కాషాయ కండువా కప్పేసుకుంది.. బీజేపీలో చేరిన రూపాలి గంగూలీ-indias top trp serial anupamaa actress rupali ganguly joins bjp today 1st may amid on going loksabha polls ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anupamaa Serial: ఇండియాలోనే నంబర్ వన్ టీవీ సీరియల్ నటి కాషాయ కండువా కప్పేసుకుంది.. బీజేపీలో చేరిన రూపాలి గంగూలీ

Anupamaa Serial: ఇండియాలోనే నంబర్ వన్ టీవీ సీరియల్ నటి కాషాయ కండువా కప్పేసుకుంది.. బీజేపీలో చేరిన రూపాలి గంగూలీ

Hari Prasad S HT Telugu
May 01, 2024 02:18 PM IST

Anupamaa Serial: ఇండియాలో టాప్ టీవీ సీరియల్ అయిన అనుపమ నటి ఇప్పుడు బీజేపీలో చేరింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇండియాలోనే నంబర్ వన్ టీవీ సీరియల్ నటి కాషాయ కండువా కప్పేసుకుంది.. బీజేపీలో చేరిన రూపాలి గంగూలీ
ఇండియాలోనే నంబర్ వన్ టీవీ సీరియల్ నటి కాషాయ కండువా కప్పేసుకుంది.. బీజేపీలో చేరిన రూపాలి గంగూలీ

Anupamaa Serial: దేశంలో అత్యధిక టీఆర్పీ సొంతం చేసుకుంటున్న టీవీ సీరియల్ ఏదో తెలుసా? స్టార్ ప్లస్ లో వచ్చే అనుపమ. చాన్నాళ్లుగా ఈ సీరియల్ కు తిరుగులేదు. అలాంటి టీవీ సీరియల్లో లీడ్ రోల్ పోషిస్తున్న రూపాలీ గంగూలీ ఇప్పుడు బీజేపీలో చేరింది. సినిమాల్లో నటించే రూపాలీ.. బీజేపీతో తన రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టింది.

బీజేపీలోకి అనుపమ నటి

అనుపమ సీరియల్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన రూపాలీ గంగూలీ బీజేపీలో చేరడం ద్వారా అభివృద్ధి అనే మహాయజ్ఞంలో పాలుపంచుకోనున్నట్లు చెప్పింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో రూపాలీ ఆ పార్టీ కండువా కప్పుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చింది.

"దేశ పౌరులుగా మనం ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా పాలుపంచుకోవాలి. ఆ మహాకాలుడు, మాతారాణి కృప వల్ల నా కళ ద్వారా నేను ప్రజలతో మమేకమవుతున్నాను. ఈ అభివృద్ధి అనే మహాయజ్ఞం చూసిన తర్వాత అందులో నేనూ పాల్గొనాలని నిర్ణయించుకున్నాను" అని రూపాలి చెప్పింది. దేశానికి సేవ చేసే క్రమంలో మోదీ అడుగుజాడల్లో నడవాలని తాను భావిస్తున్నట్లు తెలిపింది.

"మోదీ అడుగుజాడల్లో సాగుతూ దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. అమిత్ షా నేతృత్వంలో నన్ను బీజేపీలోకి ఆహ్వానించిన వారి అంచనాలను అందుకునేలా నేను ముందుకు సాగుతాను. మీ ఆశీర్వాదాలు, మద్దతు నాకు కావాలి. నేను చేసే ప్రతి పని మంచి కోసమే చేస్తాను. నేను ఏదైనా తప్పులు చేస్తే చెప్పండి" అని రూపాలి చెప్పింది.

అనుపమ సీరియల్

స్టార్ ప్లస్ లో వచ్చే అనుపమ సీరియల్ కు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ లభించింది. ఈ సీరియల్లో రూపాలి.. టైటిల్ పాత్రను పోషిస్తోంది. కొన్నాళ్లుగా ఈ సీరియల్ టాప్ టీఆర్పీతో దూసుకెళ్తోంది. ఓ సాధారణ గృహిణి పాత్రలో రూపాలి నటన అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ సీరియల్ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే సాగుతుంది. దేశంలోని ప్రతి హౌస్ వైఫ్ తనను తాను ఈ పాత్రలో చూసుకునేలా అనుపమను మేకర్స్ రూపొందించారు. దీంతో ఈ సీరియల్ కు ఆదరణ పెరుగుతూనే ఉంది. చాన్నాళ్లుగా అత్యధిక టీఆర్పీతో దేశంలో నంబర్ వన్ సీరియల్ గా అనుపమ కొనసాగుతోంది.

Whats_app_banner