Pebbles OTT Release Date: ఓటీటీలోకి ఇండియ‌న్ అఫీషియ‌ల్ ఆస్కార్ ఎంట్రీ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?-indias official oscar entry movie pebbles ott release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Indias Official Oscar Entry Movie Pebbles Ott Release Date Locked

Pebbles OTT Release Date: ఓటీటీలోకి ఇండియ‌న్ అఫీషియ‌ల్ ఆస్కార్ ఎంట్రీ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Nelki Naresh Kumar HT Telugu
Oct 23, 2023 10:53 AM IST

Pebbles OTT Release Date: ఇండియా నుంచి ఆస్కార్ అవార్డుల‌కు అఫీషియ‌ల్‌గా ఎంట్రీని ద‌క్కించుకున్న పెబెల్స్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?

పెబెల్స్ మూవీ
పెబెల్స్ మూవీ

Pebbles OTT Release Date: 94వ ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా నుంచి అఫీషియ‌ల్ ఎంట్రీని ద‌క్కించుకున్న త‌మిళ మూవీ పెబెల్స్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. అక్టోబ‌ర్ 27 నుంచి సోనీలివ్ ఓటీటీలో ఈ త‌మిళ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన పెబెల్స్ మూవీకి న‌య‌న‌తార‌తో పాటు ఆమె భ‌ర్త‌, డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ ప్రొడ్యూస‌ర్లుగా వ్య‌వ‌హ‌రించారు.

ట్రెండింగ్ వార్తలు

స్వీయ నిర్మాణ సంస్థ రౌడీ పిక్చ‌ర్స్ ప‌తాకంపై పెబెల్స్ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు వినోద్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 94వ ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా నుంచి జైభీమ్‌, మ‌ర‌క్క‌ర్‌తో పాటు ప‌లు సినిమాలు పోటీలో నిలిచాయి. కానీ స్టార్ హీరోల సినిమాల‌ను కాద‌ని పెబెల్స్ ఆస్కార్ ఎంట్రీలోనిలిచి చ‌రిత్ర‌ను సృష్టించింది. కానీ తుది నామినేష‌న్స్‌లో ఈ సినిమా చోటు ద‌క్కించుకోలేక‌పోయింది.

కూజంగ‌ల్ పేరుతో ఈ సినిమాను తెర‌కెక్కించారు. కానీ ఆస్కార్ నామినేష‌న్ కోసం సినిమా పేరును పెబెల్స్‌గా మార్చారు. పెబెల్స్ సినిమాలో చెల్లాపాండి, కురుత్తాడియ‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. తండ్రీ కొడుకులు సాగించిన ఓ ప్ర‌యాణం నేప‌థ్యంలో ఈ సినిమా సాగుతుంది. కొడుకు ద్వేషించిన తండ్రి...ఈ జ‌ర్నీలో ఎలా మారిపోయాడు అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

త‌న జీవితంలో జ‌రిగిన య‌థార్థ సంఘ‌ట‌నల‌తో ద‌ర్శ‌కుడు వినోద్‌రాజ్ పెబెల్స్ సినిమాను తెర‌కెక్కించాడు. ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో పెబెల్స్ అవార్డుల‌ను గెలుచుకున్న‌ది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.