Indian re-release: భారతీయుడు రీరిలీజ్.. థియేటర్లలోనే బాణసంచా కాల్చిన అభిమానులు..-indian rereleased in theatres fans light fireworks in a theatre in chennai video gone viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Indian Re-release: భారతీయుడు రీరిలీజ్.. థియేటర్లలోనే బాణసంచా కాల్చిన అభిమానులు..

Indian re-release: భారతీయుడు రీరిలీజ్.. థియేటర్లలోనే బాణసంచా కాల్చిన అభిమానులు..

Hari Prasad S HT Telugu
Jun 07, 2024 04:39 PM IST

Indian re-release: భారతీయుడు మూవీ థియేటర్లలో రీరిలజైన వేళ చెన్నైలో అభిమానుల సంబరాలు అదుపు తప్పాయి. థియేటర్లోనే బాణసంచా కాల్చిన వీడియో వైరల్ గా మారింది.

భారతీయుడు రీరిలీజ్.. థియేటర్లలోనే బాణసంచా కాల్చిన అభిమానులు..
భారతీయుడు రీరిలీజ్.. థియేటర్లలోనే బాణసంచా కాల్చిన అభిమానులు..

Indian re-release: ఇండియన్ 2 మూవీ రిలీజ్ కు ముందు ఎప్పుడో 28 ఏళ్ల కిందట వచ్చిన ఇండియన్ మూవీ థియేటర్లలో రీరిలీజ్ అయింది. అయితే ఈ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లలో అభిమానులు బాణసంచా కాల్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చెన్నైలోని ఓ థియేటర్లో ఈ ఘటన జరిగింది. అభిమానుల సంబరాలు శృతి మించిపోయాయి.

ఇండియన్ రీరిలీజ్

శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్, సుకన్య, మనీషా కొయిరాలా, ఊర్మిళ నటించిన ఇండియన్ (తెలుగులో భారతీయుడు) మూవీ 1996లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత ఇండియన్ 2 రూపంలో సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. జులై 12న ప్రపంచవ్యాప్తంగా మూవీ రిలీజ్ కానుంది. అయితే అంతకుముందు సూపర్ హిట్ ఇండియన్ ను రీరిలీజ్ చేశారు.

దీంతో కమల్ హాసన్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. శుక్రవారం (జూన్ 7) ఉదయం చెన్నైలోని కమలా సినిమాస్ లో ఈ మూవీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా అభిమానుల సంబరాలు శృతి మించాయి. థియేటర్లోనే బాణసంచా కాల్చారు. ఈ వీడియోను ఆ థియేటర్లో ఉన్న వాళ్లే తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దేవుడిలాగా కనిపిస్తూ సేనాపతి వచ్చేశాడు అనే క్యాప్షన్ తో ఓ అభిమాని ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. థియేటర్లో స్క్రీన్ ముందే చిచ్చుబుడ్లు కాలుస్తూ ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో స్క్రీన్ పై సేనాపతి రూపంలో ఉన్న కమల్ హాసన్ కనిపించాడు. ఇండియన్ ఈజ్ బ్యాక్ అనే స్లోగన్ ఉన్న టీషర్ట్స్ లను కూడా అభిమానులు ధరించారు. థియేటర్లలో అగ్ని ప్రమాదానికి కారణమయ్యే బాణసంచాను ఇలా విచ్చలవిడిగా కాల్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇండియన్, ఇండియన్ 2 సినిమాల గురించి..

1996లో వచ్చిన ఇండియన్ మూవీ ఓ కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. కమల్ హాసన్ డ్యుయల్ రోల్లో నటించాడు. ముఖ్యంగా సేనాపతే అని వృద్ధుడి పాత్రలో అతని నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. సమాజంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ఆ స్వాతంత్య్ర సమరయోధుడు.. అదే అవినీతికి పాల్పడుతున్న తన సొంత కొడుకును కూడా చంపేయడం మూవీలో హైలైట్.

ఇండియన్ మూవీ ఈ హత్య, తర్వాత సేనాపతి విదేశాలకు వెళ్లిపోయిన సీన్ తో ముగుస్తుంది. ఇప్పుడు ఇండియన్ 2 మూవీ అక్కడి నుంచే ప్రారంభం కానుంది. ఎప్పుడు అవినీతి జరిగినా తిరిగి వస్తానన్న డైలాగుతో ఆ సినిమా ముగియగా.. ఇండియన్ 2ను అక్కడి నుంచే ప్రారంభించినట్లు గతంలో వచ్చిన గ్లింప్స్ వీడియో చూస్తే స్పష్టమవుతోంది.

ఈ ఇండియన్ 2 మూవీ జులై 12న రిలీజ్ కానుంది. ఇందులో కమల్ హాసన్ తోపాటు సిద్ధార్థ్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. కాజల్ ఈ సినిమాలో సేనాపతి భార్య పాత్ర అమృతవల్లిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. భారతీయుడు మూవీలో ఈ పాత్రలో సుకన్య నటించింది.