ది గాడ్‌ఫాదర్.. ఎప్పుడో 53 ఏళ్ల కిందట రిలీజై పెను సంచలనం సృష్టించిన మూవీ ఇది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్, మ్యూజిక్.. ఇలా అన్నింట్లోనూ అత్యుత్తమంగా తెరకెక్కిన సినిమా. ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పొలా డైరెక్ట్ చేసిన ఈ సినిమా తర్వాతి దశాబ్దాల్లో ఎన్నోసార్లు, ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్ కు స్ఫూర్తిగా నిలిచింది.
అలా ఇండియన్ సినిమాలోనూ మణిరత్నం, రామ్ గోపాల్ వర్మలాంటి వాళ్లు కూడా ఆ స్టైల్ ఫిల్మ్ మేకింగ్ ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. అలా ది గాడ్‌ఫాదర్ స్ఫూర్తితో వచ్చి సక్సెస్ అయిన మూడు ఇండియన్ సినిమాలు ఏవి? ప్రస్తుతం అవి ఏ ఓటీటీలో ఉన్నాయో చూడండి.
మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఒకప్పటి ముంబై డాన్ వరదరాజన్ ముదిలియార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ మూవీకి స్ఫూర్తి మాత్రం ది గాడ్‌ఫాదర్ సినిమానే. అప్పట్లో ఈ నాయకుడు సినిమా పెద్ద సంచలనం. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. టైమ్ మ్యాగజైన్ ఆల్ టైమ్ 100 బెస్ట్ ఫిల్మ్స్ జాబితాలో నాయకుడు కూడా చోటు దక్కించుకుందంటే ఈ సినిమా పవరేంటో అర్థం చేసుకోవచ్చు.
కమల్ నటవిశ్వరూపం, మణిరత్నం డైరెక్షన్ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది. తనకు, మణిరత్నానికి ది గాడ్‌ఫాదర్ మూవీ అన్నా.. డైరెక్టర్ ఫ్రాన్సిస్ కొప్పొలా అన్నా చాలా ఇష్టమని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కమల్ చెప్పాడు. అదే అండర్ వరల్డ్ డాన్ కాన్సెప్ట్ ను తాము ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా మార్చి చూపించినట్లు తెలిపాడు. ఐఎండీబీలో 8.6 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. మళ్లీ ఇన్నాళ్లకు కమల్, మణిరత్నం కాంబినేషన్ లో త్వరలోనే థగ్ లైఫ్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.
రామ్ గోపాల్ వర్మ సర్కార్ మూవీ కూడా ది గాడ్‌ఫాదర్ ఆధారంగానే తెరకెక్కింది. తనకు ఆ సినిమా ఎంతో ఇష్టమని, తన గ్యాంగ్‌స్టర్ సినిమాలన్నింటినీ అదే స్ఫూర్తి అని ఆర్జీవీ కూడా ఎన్నోసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. మొత్తానికి 2005లో సర్కార్ సినిమా ద్వారా అమితాబ్ బచ్చన్ ను చాలా పవర్‌ఫుల్ గా చూపించాడు. ది గాడ్‌ఫాదర్ లో మార్లన్ బ్రాండో పోషించిన పాత్రను గుర్తుకు తెస్తుంది.
అంతేకాదు ఇటు శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే పాత్రనూ పోలి ఉంటుంది. సుభాష్ నాగ్రేగా ఈ సినిమాలో అమితాబ్ నటన మరో లెవెల్. అప్పటి వరకూ బిగ్ బీని ఎప్పుడూ ఇలాంటి పాత్రలో చూడలేదు. ఆర్జీవీ కెరీర్లోని బెస్ట్ సినిమాల్లో ఇదీ ఒకటి. ఈ బ్లాక్ బస్టర్ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, యూట్యూబ్ లలో ఈ మూవీని చూడొచ్చు.
మలయాళం ఇండస్ట్రీ నుంచి ది గాడ్‌ఫాదర్ ను పోలిన మూవీ మాలిక్ గా చెప్పొచ్చు. 2021లో ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్ సులేమాన్ (ఫహాద్) ఇంట్లో జరిగే వేడుకలనే ఏకంగా 12 నిమిషాల పాటు చూపిస్తారు.
ఇది ది గాడ్‌ఫాదర్ సినిమాలో ఉండే వెడ్డింగ్ సీన్ స్ఫూర్తితోనే తీసినట్లు స్పష్టంగా అనిపిస్తుంది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూడొచ్చు. ఐఎండీబీలో ఏకంగా 8 రేటింగ్ సొంతం చేసుకున్న బ్లాక్‌బస్టర్ సినిమా ఇది. ఫహాద్ ఫాజిల్ కెరీర్లో ఈ మాలిక్ బెస్ట్ సినిమాల్లో ఒకటిగా చెప్పొచ్చు.
సంబంధిత కథనం